వ్యాపారము

Crab Farming: పీతల పెంపకంతో సులువుగా లక్షలు సంపాదించే అవకాశం.. ఎలా అంటే..?

Crab Farmingఈ మధ్య కాలంలో ఆధునిక పద్ధతిలో ఆక్వా సాగు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రొయ్యల పెంపకంతో పాటు పీతల పెంపకం(Crab Farming) ద్వారా సులభంగా లక్షలు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులలో పీతలను పెంచడం జరుగుతుంది. ఈ బాక్సుల ద్వారా పీతల పెరుగుదలను గమనించడంతో పాటు వాటికి సులువుగా ఆహారం పెట్టే అవకాశం కలుగుతుంది.

పీతల పెంపకం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది కాబట్టి రోజురోజుకు పీతల పెంపకంపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆక్వా రంగంలో చేపల తర్వాత స్థానం పీతలు, రొయ్యలది కాగా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో పీతల సాగుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

రొయ్యలను ఏ విధంగా సాగు చేస్తామో పీతలను కూడా అదే విధంగా ఎంపిక చేసిన చెరువుల్లో సాగు చేయడం జరుగుతుంది. అయితే కొత్త పద్ధతిలో పీవీసీ పైపు గొట్టాలలో ప్రత్యేకమైన నిర్మాణాలను చేపట్టడంతో పాటు ఆ గొట్టాలకు పెట్టెలను అమర్చడం జరుగుతుంది. ఒక్కో పెట్టెలో ఒక పీతను వదలడం జరుగుతుంది. మార్కెట్లో పీతలకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది.

పీతల పెంపకం కొరకు ఆధునిక పద్దతిని జోడించి పెంచితే ఎక్కువ లాభాలను తక్కువ సమయంలో పొందవచ్చు. ఏపీలో సముద్రతీరం చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని ఆక్వా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

Back to top button