వ్యాపారము

రూ.2,400 కడితే అదిరిపోయే స్కూటర్.. ఎలా అంటే..?

TVs Jupiter

దేశంలోని అతిపెద్ద టూవీలర్ల తయారీ కంపెనీలలో ఒకటైన టీవీఎస్ మోటార్స్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను కస్టమర్ల కొరకు అందుబాటులోకి తెచ్చిన టీవీఎస్ జుపిటర్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. నెలకు రూ.2420 ఈఎంఐతో తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. టీవీఎస్ జుపిటర్ స్కూటర్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

డిస్క్ బ్రేక్స్, కొత్త ఐటచ్ స్టార్ట్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ సౌండ్ లేకుండానే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.72,347గా ఉండగా ప్రాంతాన్ని బట్టి స్కూటర్ ధరలో స్వల్పంగా తేడా ఉండే అవకాశం ఉంది. సమీపంలోని టీవీఎస్ షోరూంను సంప్రదించి ఈ స్కూటర్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఇండియాలో సెకండ్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌ కావడం గమనార్హం.

అయితే నెలకు రూ.2420 ఈఎంఐ చెల్లించాలని అనుకునే వాళ్లు మొదట 8వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తానికి ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న మొత్తానికి నెలకు రూ.2400 చొప్పున మూడు సంవత్సరాల పాటు చెల్లిస్తే సరిపోతుంది. లేదా ఒకేసారి స్కూటర్ మొత్తం ధర చెల్లించి ఈ స్కూటర్ ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

సమీపంలోని టీవీఎస్ షోరూంను సంప్రదించి స్కూటర్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కూటర్లలో ఈ స్కూటర్ బెస్ట్ స్కూటర్ అని చెప్పవచ్చు.

Back to top button