ప్రత్యేకంబిగ్ స్టోరీస్

పాస్ వర్డ్స్ తరచూ మరిచిపోతున్నారా.. ఈ పని చేస్తే సమస్యకు చెక్..?

Forgot Password
దేశంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఆన్ లైన్ ద్వారా షాపింగ్ చేసేవాళ్లు, ఆన్ లైన్ సేవలను ఉపయోగించి బ్యాంకు లావాదేవీలు జరిపేవాళ్లు, సోషల్ మీడియా ఖాతాలను వినియోగించే వాళ్లు అంతకంతకూ పెరుగుతున్నారు. అయితే ఒక్కో అకౌంట్ కు ఒక్కో పాస్ వర్డ్ ను ఉపయోగించడం వల్ల చాలా సందర్భాల్లో పాస్ వర్డ్ గుర్తుకు రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: 77సార్లు ట్రాఫిక్ ఉల్లంఘించిన వ్యక్తి.. పోలీసులు ఏం చేశారంటే..?

అలా కాకుండా ప్రతి అకౌంట్ కు ఒకే పాస్ వర్డ్ ను ఉపయోగిస్తే మన ఖాతాలను ఇతరులు హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంక్ కు సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా జరిపే వాళ్లు పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేస్తే అకౌంట్ లాక్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు మైక్రోసాఫ్ట్ ఒక శుభవార్త చెప్పింది. పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ద్వారా సులభంగా పాస్ వర్డ్ లను గుర్తుంచుకునే అవకాశం కల్పిస్తోంది.

Also Read: ఈ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు..?

అయితే మైక్రోసాఫ్ట్ యూజర్లు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ యూజర్లు క్రోమ్ ద్వారా గూగుల్ అకౌంట్ ను ఉపయోగించి పాస్ వర్డ్ ను స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్‌పాస్‌.కామ్‌ వెబ్ సైట్ ద్వారా కూడా పాస్ వర్డ్ లను స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వెబ్ సైట్ ద్వారా ఇతర వెబ్ సైట్లలోకి ఆటో లాగిన్ కావడంతో పాటు మాన్యువల్ లాగిన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఈ వెబ్ సైట్ డేటా ప్రైవసీని అందిస్తుంది కాబట్టి మన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. లాస్ట్ పాస్.కామ్ కొత్త పాస్ వర్డ్ లను జనరేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా పాస్ వర్డ్ లు ఎంటర్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురు కావు.

Back to top button