వ్యాపారము

బ్యాంక్ సూపర్ స్కీమ్.. ఒక్క రూపాయితో నాలుగు లక్షలు?

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ కు కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) స్కీమ్ ల ద్వారా ఖాతాదారులకు ఈ బ్యాంక్ ప్రయోజనం చేకూర్చుతోంది. కెనరా బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు సులువుగా ఇంటి నుంచే ఈ స్కీమ్ లో చేరవచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో కెనరా బ్యాంక్ ఈ స్కీమ్ లో చేరే అవకాశం కల్పిస్తోంది. కెనరా బ్యాంక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. పీఎంజేజేబీవై స్కీమ్ టర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ లో చేరిన పాలసీదారుడు మరణిస్తే ఖాతాదారుని కుటుంబానికి ఏకంగా రెండు లక్షల రూపాయలు లభిస్తాయి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం రూ.330 చెల్లించాల్సి ఉంటుంది.

పీఎంఎస్‌బీవై స్కీమ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాగా ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రమాదవశాత్తూ మరణిస్తే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఏకంగా 2 లక్షల రూపాయలు లభిస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తికి శాశ్వత అంగవైకల్యం సంభవించినా ఈ స్కీమ్ డబ్బులు వస్తాయి. నెలకు ఒక్క రూపాయి చొప్పున 12 రూపాయలు ఈ స్కీమ్ కోసం చెల్లిస్తే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఈ రెండు స్కీమ్స్ లో చేరడానికి రోజుకు రూపాయి చొప్పున మొత్తం 342 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కరోనా విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో ఈ స్కీమ్ లో చేరయడం వల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పవచ్చు.

Back to top button