జనరల్విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. క్యాప్ జెమిని కంపెనీలో 30 వేల ఉద్యోగాలు..?

Capgemini Recruitment 2021

గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ ఎక్కువగా జరగలేదు. కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన క్యాప్ జెమిని ఈ ఏడాది ఏకంగా 30,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది.

Also Read: బీటెక్ పాసైన యువతులకు శుభవార్త.. ఏపీలో 100 ఉద్యోగాలు..?

క్యాప్‌ జెమిని సీఈవో అశ్విన్ యార్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ 30,000 ఉద్యోగ ఖాళీలలో ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్నవారికి సైతం అవకాశం కల్పించడం గమనార్హం. ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియామకాలను చేపడుతున్నామని అశ్విన్ వెల్లడించారు. 2020 సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువగా నియామకాలను చేపడుతున్నామని అశ్విన్ అన్నారు.

Also Read: బీఈ, బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎన్‌ఎండీసీలో 67 ఉద్యోగాలు..?

క్యాప్ జెమినీ కంపెనీ డిసెంబర్ త్రైమాసికం ఆదాయంలో క్లౌడ్‌ బిజినెస్‌, డిజిటల్ సొల్యూషన్స్ వాటా 65 శాతం కావడం గమనార్హం. కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల నియామకం జరగనుంది. 2020 ఏప్రిల్ నెలలో కరోనా ఉధృతి ఉన్నా వేతనాలను పెంచినట్టు అశ్విన్ తెలిపారు. గతేడాది కంపెనీ 24,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ నియామకాలు భారీగా పుంజుకోవడం గమనార్హం. మరో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ 2021 సంవత్సరంలో ఏకంగా 23,000 మంది ఉద్యోగులను నియమించుకోనుండటం గమనార్హం.

Back to top button