అత్యంత ప్రజాదరణక్రిస్మస్ స్పెషల్పండుగ వైభవం

క్రిస్టియన్లకు ‘కరోనా’.. కొత్త అనుభవాన్ని పంచబోతుందా..!

కరోనాలో క్రిస్మస్ వేడుకలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారాయి.

carona christmas

క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండుగ కోసం క్రిస్టియన్లు ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. ఇక పండుగకు వారం పదిరోజుల ముందు నుంచి ప్రతీ ఇంట్లో క్రిస్మస్ సందడి మొదలవుతుంది.

ఈసారి ఏడాది కరోనా మహమ్మరి కారణంగా ఎప్పటిలాగే క్రిస్మస్ వేడుకలు జరుపుకోనే అవకాశం లేదు. ఇక మరో నాలుగైదు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుండటంతో క్రిస్టియన్లంతా కరోనా నిబంధనలు పాటిస్తూనే వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతుండం విశేషం.

ఆయా చర్చిల్లోని ఫాదర్లు.. నిర్వాహకులు కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రార్థనలు.. వేడుకలు జరుపుకునేలా పకడ్చంధీ చర్యలు తీసుకుంటున్నారు. చర్చిలను శానిటైజర్లు చేయడం.. ప్రార్థనల్లో భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈసారి క్రిస్మస్ వేడుకలు ఢిపరెంట్ గా కన్పించే అవకాశం ఉంది.

ఇక క్రిస్మస్ వేడుకలను ప్రతీయేటా అంగరంగ వైభవంగా నిర్వహించే లండన్లో ఈసారి వేడుకలను రద్దు చేయడం శోచనీయంగా మారింది. బ్రిటన్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆదేశంలో క్రిస్మస్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ఆదేశ ప్రధాని ప్రకటించారు. క్రిస్మస్ వేడుకలను ఈసారి కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని కోరారు.

ఇక మరికొన్ని దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఈసారి క్రిస్మస్ వేడుకలు చాలా డిఫరెంట్ గా కన్పించబోతున్నాయి. కరోనాలో టైంలోని క్రిస్మస్ వేడుకలను కొత్తగా జరుపుకునేందుకు క్రిస్టయన్లు సిద్ధమవుతుండటం ఆసక్తిని రేపుతోంది.

Back to top button