కరోనా వైరస్జాతీయం

మన కరోనా వ్యాక్సిన్‌ మరింత లేట్‌..వచ్చే ఏడాదే?

ఆశలన్నీ ఆక్స్‌ఫర్డ్‌, కోవాగ్జిన్‌పైనే..

Corona Vaccine

కొవిడ్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 15 వరకే వ్యాక్సిన్‌ వస్తుందని ఆశపడినా అది నెరవేరలేదు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ మరో బాంబ్‌ పేల్చారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అత్యవసర అనుమతులు ఇచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. వ్యాక్సిన్‌ భద్రతపై ప్రజల అనుమానాలు పోగొట్టేందుకు తొలి వ్యాక్సిన్‌ తానే వేయించుకుంటానని సోషల్‌ మీడియా అభిమానులతో నిర్వహించిన ‘సండే సంవాద్‌’లో స్పష్టం చేశారు.

Also Read : సుశాంత్ ఫామ్ హౌస్ లోనే డగ్స్ పార్టీలు?

ప్రపంచ దేశాలకన్నా వ్యాక్సిన్‌ తయారీలో ముందు వరుసలో ఉన్న రష్యా.. ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ను దేశంలోని అన్ని ప్రాంతాలకూ పంపించింది. సోమవారం నాటికి అన్ని ప్రాంతాలకూ వ్యాక్సిన్‌ అందుతుందని ఆ దేశ ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురష్కో తెలిపారు. గమలేయా రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ 40 వేల మందిపై జరుగుతున్నాయి. మరోవైపు రష్యా చిన్నారులు మళ్లీ బడికెళ్తున్నారు. అక్కడ 5,449 కరోనా కేసులే నమోదయ్యాయి. 2020-–21లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) తెలిపింది.

మరోవైపు మన దగ్గర మెజారిటీ ప్రజలకు టీకా వేసేలా సవివర ప్రణాళికలను నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ నేతృత్వంలోని ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌-19’ రచిస్తోందని హర్షవర్ధన్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ ఎంతవరకు సురక్షితం, ధర, సరఫరా, ఉత్పత్తి వంటి అంశాలపై కమిటీ చర్చిస్తోందన్నారు. కరోనా వారియ ర్స్‌కు, వృద్ధులకు తొలుత వ్యాక్సిన్‌ వేసేలా అత్యవసర అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ వ్యాక్సిన్లకు సంబంధించి ‘కొయలిషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సెపి)’తో భారత్‌ కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

భువనేశ్వర్‌‌లో నిర్వహించిన ‘ఒడిశా ఆలోచన చక్ర’ వెబినార్‌‌లో పాల్గొన్న వైద్య నిపుణులు కూడా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే.. ఇప్పటివరకు భారత్‌ ఆశలన్నీ ఆక్స్‌ఫర్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌పైనే ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు సంబంధించి 2,3 దశల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కోవాగ్జిన్‌ ఫేజ్‌ 1 ట్రయల్స్‌ సెప్టెంబర్‌‌ రెండో వారంలో ముగిశాయి. వ్యాక్సిన్‌ రాగానే.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసి పంపిణీ చేయనున్నారు.

Also Read : కరోనా వైరస్ ఎలా ఉంటుందో తెలుసా?

Back to top button