తెలంగాణరాజకీయాలు

కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో వలస కార్మికులు, ఉద్యోగులతోపాటు ప్రతీఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం కొన్ని నెలలుగా సడలింపుల పేరుతో ఆన్ లాక్ చేస్తోంది. దీంతో దేశంలోని పరిస్థితులను తిరిగి యథాస్థితి చేరుకుంటున్నాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైపోయింది. ప్రస్తుతం కొన్నిరంగాలు కోలుకుండటంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతున్నట్లు కన్పిస్తోంది. అయితే లాక్డౌన్ సమయంలో కరోనా నివారణ కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలకు కోవిడ్ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read : అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్

దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కూడా కేంద్రం కరోనా నిధులు కేటాయించింది. అయితే కరోనా కట్టడి టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కరోనా నిధుల కింద 7వేల కోట్ల రూపాయాలు విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులను కేసీఆర్ సర్కార్ ఏం చేసిందంటూ నిలదీశాడు.

కరోనా నిధుల విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొద్దిరోజులుగా గట్టిగా నిలదీస్తున్నారు. కేంద్రం నిధుల విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రతికల్లో ప్రముఖంగా ప్రచురితమయ్యారు. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీటర్లో దీనిపై స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా నిధుల కింద వచ్చినవి కేవలం రూ.290కోట్లేనని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఫ్రూప్ కాపీని ట్వీటర్లో జతపరిచి కేటీఆర్ ట్వీట్ చేశాడు.

కరోనా నిధుల విషయంలో బండి సంజయ్ చెప్పిన నిధులకు.. మంత్రి కేటీఆర్ చెప్పిన నిధులు భారీ తేడా కన్పిస్తోంది. దీంతో ఈ విషయంలో ఎవరీ మాటాలు నమ్మాలో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. నిజంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.7వేల కోట్లు విడుదల చేస్తే ఆ నిధులన్నీ ఎటువైపు వెళ్లాయనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు ఆధారాలతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతారా?  లేదా అడ్డంగా బుక్కవుతారో వేచిచూడాల్సిందే..!

Back to top button