ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

డాక్టర్ సుధాకర్ పై కేసు పెట్టిన సిబిఐ..!


ప్రభుత్వ మత్తు వైద్యుడు సుధాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణ చేపట్టిన సీబీఐ విశాఖ పోలీసులు సమర్పించిన వివరాలతో సుధాకర్ పై కేస్ నమోదు చేశారు. దీంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అన్ని వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ ను కింద పడేయడం తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారన్నది ఎఫ్.ఐ. ఆర్ లో పేర్కొంది. కేసు వివరాలను తన వెబ్సైట్ లోనూ పొందుపరిచింది.

విశాఖ పోర్టు ఆసుపత్రికి సమీపంలో సుధాకర్ ను అరెస్టు సందర్భంగా మే 16వ తేదీన చోటు చేసుకున్న సంఘటనపై 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్ ను సీబీఐకి ఫోర్త్ టౌన్ పోలీసులు అందజేశారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్ పై సెక్షన్ 188 నమోదు చేశారు.

మరోవైపు సుధాకర్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా సుధాకర్ ను కొట్టడం, కాలితో తన్నడం, చేతులు వెనక్కి మెలిపెట్టి కట్టేసి ఎండలో రోడ్డుపై పడుకోపెట్టడం చర్యలకు పాల్పడ్డారు. విచారణకు సిబిఐ సంబంధించిన రిపోర్టును హైకోర్టుకు అందించాల్సి ఉంది.