జాతీయంజాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

ఓటేసిన ప్రముఖులు.. కమల్, రజినీకాంత్ ఇలా

Celebrities who voted .. like Kamal and Rajinikanth

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈరోజు దక్షిణాదిన సందడి నెలకొంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు ఈరోజు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కట్టుబాట్లు ఉన్నా కూడా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటర్లు అందరూ తమ ఓటు వేసి బాధ్యతను నిర్వర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. మొత్తం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో 475 స్థానాల్లో 20 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురైన తర్వాత రాజకీయ సన్యాసం పలికి తొలిసారి బయటకు వచ్చారు. ‘తౌజండ్ లైట్స్’ నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు.

తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, , ఉదయనిధిలు తేనంపేటలో ఓటు వేశారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్, కుమర్తెలతో కలిసి తేనంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక తెలంగాణ గవర్నర్ తమిళిసై, మెట్రో శ్రీధరన్, కాంగ్రెస్ నేత చిదంబరం సహా హీరోలు విజయ్, అజిత్ సూర్య, కార్తి తదితరులు ఉదయాన్నేవచ్చి ఓటు వేశారు. స్టార్ హీరో విజయ్ కాలుష్య రహితంగా సైకిల్ పైకి వచ్చి ఓటు వేశారు.

Back to top button