ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

మీ చావు మీరు చావండి.. ఏపీపై కేంద్రం నిర్ణయమిదే?


ఒక బ్రెడ్డూ ముక్క (ఏపీ రాజధాని) కోసం రెండు పిల్లులు (వైసీపీ, టీడీపీ) కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చిన కోతి ఆ బ్రెడ్డును ఎత్తుకుపోయిందట.. ఇప్పుడీ కథలో కోతి పాత్రలో ఉన్న కేంద్రం మాత్రం మీ బ్రెడ్డూ వద్దూ జామూ వద్దని.. మీ చావు మీరు చావండని వదిలేసింది.. దీంతో ఏపీ రాజకీయాలను రసకందాయంలో పడేసింది.

Also Read: 72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

అమరావతిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఉండేది. చంద్రబాబు లాబీయింగ్ పనిచేస్తుందా? జగన్ పరపతి పనికొస్తుందా అని అందరూ ఎదురుచూస్తుండగా.. కేంద్ర హోంశాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రాజధానిపై అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రానికి రాజధాని నిర్ణయించే అధికారం కేంద్రం పరిధిలోకి వస్తుందా లేదా అని మీనమేశాలు లెక్కిస్తున్న వేళ కేంద్ర హోంశాఖ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది.

ఏపీ రాజధాని నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అమరావతిని గత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని.. మూడు రాజధానుల నిర్ణయం కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపింది.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

కేంద్రం తాజా నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గొప్ప ఓదార్పును ఇచ్చింది. రాజధాని విషయంలో ఇక కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని క్లియర్ గా తెలిసొచ్చింది.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపే ముందు అమరావతి విషయంలో రైతులకు కేంద్రాన్ని ఒప్పించి న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. దీంతో పవన్, చంద్రబాబు కలిసి అమరావతి విషయంలో ఏదైనా చేస్తారని భయపడిన వైసీపీకి ఆ భయాలు మొత్తం తొలిగిపోయాయి. ఇక వైసీపీ మూడు రాజధానులపై ఆడింది ఆట పాడింది పాటగా ఉండనుంది.

-ఎన్నం

Back to top button
Close
Close