క్రీడలు

తొలి మహిళా క్రికెట్ కామెంటేటర్ మృతి

Chandra Nayudu, regarded as India's first female cricket commentator, passes away

భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా పేరుగాంచిన చంద్రానాయుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మరణించారు. ఈమె మాజీ క్రికెటర్ సికే నాయుడు కుమార్తె కావడం విశేషం.. ఈమె ఆమె సోదరి కుమారుడు విజయ్ నాయుడు మీడియాకు వివరించారు. కొంతకాలంగా చంద్రానాయుడు అనారోగ్యంగా ఉన్నారని.. ఈ మధ్యాహ్నం ఆమె కన్నుమూసినట్లు తెలిపారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. “చంద్రానాయుడు తన చురుకైన జీవితంలో దాదాపు 60 సంవత్సరాలుగా క్రికెట్ కామెంటరీలో ఆరితేరారు. వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా ఆమె 88 సంవత్సరాల వయసులో కన్నుమూశారు’ అని ఆమె సోదరి కుమారుడు తెలిపారు.

ఇండోర్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసి క్రికెట్ ఆడడాన్ని చంద్రనాయుడు మొదలు పెట్టారు. 50వ దశకంలో హోల్కర్ కాలేజీలో చదువుతున్నప్పుడు బాలికలు తెలుపు సల్వార్ కమీజ్ ధరించి ఆడేవారు. ఆమె క్రికెట్ పట్ల అమిత ఆసక్తిని కనబరిచింది. అంతర్జాతీయ మ్యాచ్ లలో కామెంటరీ చేసిన ప్రథమ మహిళా వ్యాఖ్యాతగా చంద్రానాయుడు పేరుపొందారు..

చంద్రానాయుడు ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్ టోర్నమెంట్‌ను కూడా ప్రవేశపెట్టారు. 80 వ దశకంలో తన తల్లి జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించారు.ఆమె మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో చురుకైన సభ్యురాలు. అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. “రోటరీ క్లబ్ ఆఫ్ ఇండోర్ మరియు జెయింట్స్ ఇంటర్నేషనల్ యొక్క క్రియాశీల సభ్యురాలు కూడా.. క్రికెట్ యేతర సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంది.

ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో తన తండ్రి సి.కె. నాయుడు క్రికెట్ ఆడుతుండగా.. లార్డ్స్ కామన్ రూమ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించిన ఏకైక మహిళ చంద్రానాయుడు కావడం విశేషం. ఈ ప్రసిద్ధ మ్యాచ్ తర్వాత సర్ ఆర్థర్ గిల్లిగాన్ తన బ్యాట్‌ను సికెకి సమర్పించారు, ఇందులో 11 సిక్సర్లు మరియు 14 ఫోర్ల సహాయంతో సికె 156 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్ తో భారతదేశాన్ని ప్రపంచ క్రికెట్ మ్యాప్‌లోకి తీసుకువచ్చింది సీకే నాయుడు.

చంద్ర నాయుడు కొన్నేళ్ల క్రితం వరకు చురుకుగా ఉండి బిసిసిఐ, సిసిఐ మరియు ఎంపిసిఎ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.ఆమె కన్నుమూయడంతో క్రికెట్ ప్రపంచ దిగ్భ్రాంతికి గురైంది. ఆమెకు క్రికెటర్లు, దిగ్గజాలు అంతా నివాళులర్పించారు.

Back to top button