ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలుసంపాదకీయం

చంద్రబాబు.. ఓ ‘23’.. విడదీయని అనుబంధం

Chandrababu .. ‘23’ number .. inseparable appendage

‘నిను వీడని నీడను నేను.. కలగా మిగిలే కథ నేను’ అంటూ సాగే పాటను ఇప్పుడు చంద్రబాబుకు అప్లై చేస్తున్నారట కొందరు వైసీపీ నేతలు. ఎందుకలా అంటే.. చంద్రబాబుకు.. 23వ నంబర్ కు ఓ విడదీయరాని అనుబంధం ఉందట.. ఆయన జీవితంలో 23 లేనిదే చంద్రబాబు లేనంతా అనుబంధం పెరిగిపోయిందట.. 23కు చంద్రబాబుకు సంబంధం ఏంటి? ఎందుకు ఆ సంఖ్య ఆయననే చుట్టుముడుతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

40 ఇయర్స్ చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలు చవిచూశాడు. రాజకీయాల కోసం ఎన్నో తప్పులు చేశాడనే చెప్పాలి. కానీ విధి రాసిన వింత నాటకంలో ఆయనను ‘23’వ సంఖ్య మాత్రం చాలా గట్టిగానే పట్టుకుందట.. చంద్రబాబును విడవనంటోదట..

రౌడీ నెంబర్ 1, కేడీ నెంబర్ 1, ఎఫ్ 2, గూఢచారి 116 సినిమా పేర్లు ఇవి.. టీవీ 9, టీవీ 5, 99 టీవీ, 10 టీవీ.. ఇవి న్యూస్ ఛానెల్స్ నెంబర్లు.. రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నెంబర్ కు పేటెంట్ హక్కుగా మారిన ఒకే ఒక నాయకుడు హైటెక్ రత్న చంద్రబాబునాయుడు అని తెలుగు తమ్ముళ్లు గర్వంగా చెప్పుకుంటున్నారట.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 12 ఏళ్ల ప్రతిపక్ష నేత 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో ‘23’ అనే సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యత పెరిగింది. ‘ ఇది చంద్రబాబును పట్టుకొని వదలనంటోంది.

మార్కెట్లో సంఖ్యాశాస్త్రానికున్న డిమాండ్ ఏంటో అందరికీ తెలుసు. దీని మూలంగా అనేక కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రవాణాశాఖలో చూస్తే లక్కీ నెంబర్ ఆధారంగానే కార్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగుతూ ఉంటాయి. రవాణా శాఖకు ఈ లక్కీ నెంబర్ల ద్వారానే ఎక్కువగా ఆదాయం లభిస్తుంది కూడా. సమాజంలో ఈ సంఖ్యాశాస్త్రాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. ఒకరికి 1 అంటే ఇష్టం, ఒకరికి 3 అంటే ఇష్టం, ఒకరికి 5 అంటే ఇష్టం.. చాలా మందికి 9 అంటే ఇష్టం. సంఖ్యా శాస్త్రంలో అదృష్ట సంఖ్యల మాదిరిగానే.. దురదృష్ట సంఖ్యలూ ఉంటాయి. వాటిలో 13 అనే నెంబర్ చాలా ఫేమస్. ఈ నెంబర్ తో సినిమా కూడా వచ్చింది. అలాగే హోటల్ రూం కేటాయించేటప్పుడు ఈ నెంబర్ లేకుండా చూసుకుంటారు. అ నంబరంటే అంత భయం మరి.

సమాజంలో చాలా మంది 13 నెంబర్ ను చూసి భయపడుతూ ఉంటే నారా చంద్రబాబునాయుడు మాత్రం 23 ను చూసి భయపడాల్సి వస్తోంది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ బ్రహ్మానందంతో ఇలా అంటాడు.. ‘నున్వు ఎక్కడ మొదలయ్యావో.. అక్కడే ఉంటావ్’.. అని.. ఇదే చంద్రబాబు రాజకీయ జీవితంలోనూ అదే జరిగింది. 2014-2019ల మధ్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నుంచి లాగేసిన ఎమ్మెల్యేల సంఖ్య 23. 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు తేది మే 23. ఆ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్ల సంఖ్య 23. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ 1983 జనవరి 23న జన్మించాడు. అలా బాబుకు 23 నంబర్ కు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని ఇప్పుడు సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

Back to top button