ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బాబుకు గోరంత ఆనందం, కొండంత విచారం…!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి నియమిస్తూ ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనితో రాత్రి నుండి టీడీపీ మీడియా పాపం పనిగట్టుకుని మరీ దీన్ని ప్రచారం చేసింది. ప్రభుత్వంపై నిమ్మగడ్డదే పై చేయి అయ్యింది, ప్రభుత్వానికి న్యాయస్థానాల మొట్టికాయలు, ఏ దారిలేని వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆదేశాలు పాటించింది అంటూ కథనాలు రాయడం జరిగింది. ఇది నిజంగా టీడీపీ సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే నిమ్మగడ్డ పోరాటంలో టీడీపీ అన్నీ తానై నడిపింది. నిమ్మగడ్డ ప్రతి అడుగులో వెనకుండి ప్రోత్సహించింది. నిమ్మగడ్డ నియామకంతో తన పంతం నెగ్గినట్టుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిమ్మగడ్డ విజయాన్ని తమ విజయంగా ఆస్వాదిస్తున్నాయి.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఐతే వీరి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వీరి తాత్కాలిక ఆనందానికి గవర్నర్ నిర్ణయం శాశ్వతమైన బాధను మిగిల్చింది. నిమ్మగడ్డ నియామకం టీడీపీకి కేవలం తాత్కాలికంగా ఉపశమనం కలిగించే అంశమే. ఎందుకంటే పదవి కాలం ముగియగానే, నిమ్మగ్గడ్డ ఆ కుర్చీ నుండి తప్పుకోవాల్సివుంటుంది. కానీ నేటి గవర్నర్ నిర్ణయం శాశ్వతంగా చంద్రబాబు కలలను కూల్చివేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు పాలనా వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు. దీనితో అమరావతి నుండి రాజధానిని వైజాగ్ కి తరలించాలన్న జగన్ నిర్ణయానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే వైజాగ్ కేంద్రంగా పరిపాలన సాగించడానికి జగన్ భూముల సేకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాలపై దృష్టి సారించడంతో పాటు, ఆ దిశగా కొంత పని కూడా మొదలుపెట్టారు. గవర్నర్ నిర్ణయం ఏమవుతుందో అని రెండు వారాలకు పైగా ఎదురుచూస్తున్న ప్రభుత్వానికి తీపి కబురు అందింది.

Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

ఇక రాజధాని మార్పు అనేది అనివార్యం అవుతున్న తరుణంలో బాబుకు ఈ విషయం అసలు మింగుడు పడడం లేదు. ఎలాగైనా తానుశంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని కాపాడుకోవాలని బాబు చేసిన విశ్వప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో ఏమి పాలుపోవడం లేదు. టీడీపీ నిర్ణయానికి అనుకూలంగా గవర్నర్ తీర్పు నేపథ్యంలో, ఆయనపట్ల బాబు వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజుల క్రితం నిమ్మగడ్డకు తిరిగి బాధ్యతలు అప్పగించాలంటూ గవర్నర్ చెప్పిన తరుణంలో ఆయన తీర్పును బాబు స్వాగతించారు. రాజ్యాంగాన్ని కాపాడారని కొనియాడారు. మరి నేటి గవర్నర్ నిర్ణయం బాబుకు గొడ్డలి పెట్టు కాగా ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags
Show More
Back to top button
Close
Close