ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

హోం క్వారంటైన్ లో చంద్రబాబు


కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ లో హోం క్వారంటైన్ లో ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. ఖాళీగా ఉంటూ రోజూ ఎవరికొకరికి ఉత్తరాలు రాస్తున్నారన్నారు.

కరోనా సాయం రూ. వెయ్యి ఇచ్చి వైసిపి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారని, పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాం అంటున్నారని, గతంలో కూడా పెన్ డ్రైవ్ పెద్ద సంచలనం అయ్యిదన్నారు. కరోనా పోయే వరకు చంద్రబాబు రాజకీయం చేయడం మానితే మంచిదని హితవు పలికారు. వెయ్యి ఇచ్చి.. ఓట్లు వేయాలని అడిగినట్లు నిరూపిస్తారా అని చంద్రబాబు ను ప్రశ్నించారు. ఎక్కడో వైసిపి కార్యకర్తలు కనిపించారని, రాజకీయం చేయడం చంద్రబాబు స్థాయికి తగదన్నారు.

ఐదు వేలు ఇవ్వాలని లేఖలు రాస్తున్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
పులివెందులలో బెదిరించిన వారెవరో చెప్పాలని కోరారు. కుప్పంతో సహా రాష్ట్రం లో ఎక్కడైనా రైతులకు మేలు చేస్తామని చెప్పారు. జీతాలు విడతల వారీగా ఇస్తున్నామంటే రూ. వేల కోట్లు కాంట్రాక్టర్ లకు ఇచ్చామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కరోనా ను రూపు మాపేందుకు యుద్ధం చేస్తుంటే.. టిడిపి కి రాజకీయ చేస్తుందన్నారు.

Back to top button