ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు

Chandrababu
ఎన్నడూ పెద్దగా పూజల్లో కనిపించని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ మధ్య పూజలు జరిపిస్తున్నారు. చంద్రబాబునాయుడు అటూ ఇటూ తిరిగి ఇప్పుడు స్వామీజీల మీద కూడా పడ్డాడని ఆస్తిక జనులు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే ఏం తెలియడం లేదని కూడా మండిపడుతున్నారు.

Also Read: తిరుపతి, సాగర్‌‌ ఎన్నికలకు మార్చి 7న షెడ్యూల్‌..!

సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చేదు ఫలితాలు రావడంతో ఏదేదో మాట్లాడేస్తూ విశాఖ శారదాపీఠంపైన దారుణమైన కామెంట్స్ చేయడం ఏంటని బ్రాహ్మణ సమాజం పెద్దలు నిలదీస్తున్నారు. శారదాపీఠంలో ఉన్న అమ్మవారు రాజశ్యామల మాత, అక్కడ కొలువు తీరిన అమ్మవారు శాంతమూర్తి అని ఆమెకు చేసే అర్చనలతో లోకం సుభిక్షంగా ఉంటుందని ఉమ్మడి ఏపీ అర్చక పురోహిత పరిషత్‌ కార్యదర్శి ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ చెప్పుకొచ్చారు.

అలాంటిది.. పెందుర్తి శారదాపీఠంలో క్షుద్ర పూజలు చేస్తున్నారని, తనను చంపడానికే ఇదంతా చేస్తున్నారని బాబు గంగవెర్రులెత్తడం పూర్తిగా క్షుద్ర రాజకీయమేనని అంటున్నారు. అధికార వ్యామోహం చంద్రబాబు కళ్లు కప్పేయడంతోనే ఇలా దేవుడికీ, దెయ్యానికీ తేడా తెలియక మాట్లాడుతున్నారని కూడా శర్మ మండిపడ్డారు. శారదామాతకు చేసే పూజలను క్షుద్ర పూజలు అంటూ విమర్శించడం ద్వారా బాబు తీవ్ర అపచారానికి పాల్పడ్డారని ఆయన అంటున్నారు.

Also Read: షర్మిల పార్టీతో జగన్‌కు మరిన్ని విభేదాలు వచ్చినట్లేనా..?

చివరికి బాబు తన రాజకీయాలను ఇలా చేయడంపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి మతాన్ని కూడా తీసుకువచ్చి బాబు వేస్తున్న కొత్త ఎత్తులను జనాలు గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఆయనకు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని కూడా శర్మ స్పష్టం చేశారు. మొత్తానికి అధికారం పోయిందనే ఆందోళనలో బాబు ఏదేదో మాట్లాడడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Back to top button