ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?


ఏపీలో ఎప్పుడు ఎక్కడ చూసినా మూడు రాజధానుల అంశంపైనే చర్చ జోరుగా నడుస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు తాజాగా ఆమోదముద్ర వేయడంతో ఏపీ రాజకీయాలు హిటెక్కాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తుండగా టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం వాడివేడిగా కొనసాగుతోంది.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

బాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. అయితే టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా అమరావతి డిజైన్లు, ప్లానింగ్ సమయాన్ని వృథా చేయడంతో అక్కడ రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్ లతో అమరావతి ప్రజలను ఐదేళ్లు మాయచేశారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. కిందటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం జగన్ ఏపీలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా వికేంద్రీకరణ బిల్లుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

మూడు రాజధానుల కాన్సెప్ట్ ను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అమరావతి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ దీక్షలు కూడా చేపట్టింది. ప్రభుత్వం మాత్రం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదించుకుంది. అయితే శాసన మండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో వికేంద్రకరణ బిల్లును టీడీపీ అడ్డుకోగలిగింది. అయితే శాసనసభ ప్రవేశపెట్టిన బిల్లును శాసన మండలి కేవలం నెలరోజులు మాత్రమే అడ్డుకోగలదు. ఆ తర్వాత వారు ఆమోదించినా ఆమోదించకపోయిన నిర్ణయం అధికారం శాసన సభకే ఉంటుంది. దీంతో ఈ బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. దీంతో తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.

ఈ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజీనామాకు సిద్ధమవుతున్నారని సమాచారం. అమరావతి రాజధాని ప్రాజెక్టు జగన్ సర్కార్ అటెకెక్కించడంతో ఒక్కోసారి కనీళ్లు వస్తున్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారనే టాక్ విన్పిస్తుంది. టీడీపీ చెందిన 20మంది ఎమ్మెల్యేలతోపాటు చంద్రబాబుకు రాజీనామా సిద్ధమవుతున్నారట. ఈమేరకు గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: చినబాబు ‘సైకిల్ యాత్ర’ సాహాస యాత్రగా మారనుందా?

ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రరెడ్డి తన పదవీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే టీడీపీ రాజీనామాలతో మూడు రాజధానుల నిర్ణయం ఏమేరకు ఆపగలరనేది ప్రశ్నర్థాకంగా మారుతోంది. రాజీనామాలు చేయడం ద్వారా ఉప ఎన్నికలు వస్తాయే తప్ప అధికారంలో మార్పు వచ్చే అవకాశం కన్పించడం లేదు. దీంతో చంద్రబాబు కేవలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల మద్దతు కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో అమరావతి రాజధాని కోసం మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రాంతంలో ప్రభుత్వం రాజధాని ఏర్పాటు చేస్తే ప్రజలు వ్యతిరేకించే అవకాశం కన్పించడం లేదు. ఇది జగన్ సర్కారుకు అడ్వాంటేజ్ కానుంది. ఒకవేళ చంద్రబాబు అమరావతి కోసం రాజీనామా చేస్తే మాత్రం మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో అమరావతి రాజధాని క్లమాక్స్ కు చేరినట్లు కన్పిస్తుంది. ఇక చంద్రబాబు రాజీనామా చేస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags
Show More
Back to top button
Close
Close