ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

యువతపై ‘బాబు’ గురి..!


పార్టీలో నెలకొన్న సంకోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం నాయకులంతా టీడీపీని వీడుతున్న తరుణంలో సంక్షోభం నుంచి బయట పడేందుకు యువత అవకాశం కల్పించడం తప్ప మరో మార్గం లేదని గుర్తించారు. ఈ విషయాన్నే నిర్మొహమాటంగా మహానాడు వేదికపై వ్యక్తం చేశారు.

పార్టీలో యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ నాయకులను తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీని వీడటం, మరికొందరు మరణించడంతో ఏర్పడిన లోటు తీర్చు కోవడానికి యువతకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. మహానాడు ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. కార్యకర్తల త్యాగాలను ఎన్నడూ మర్చిపోనని చెప్పారు.గడిచిన ఏడాది కాలంలో దురదృష్టమైనదిగా పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా చోట్ల అధికార పార్టీ వేధింపులకు గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ ఎంతో దైర్యంతో పార్టీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం కుటుంబ సభ్యులను కోల్పోయిన వెనకడుగు వేయకుండా పని చేయడం అందరికి స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇటువంటి కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీ టిడిపి అని చెప్పారు. వీరందరికి పాదాభివందనం చరిస్తున్నానని తెలిపారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు సేవానిరతిని ప్రదర్శించారని అన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పేదలకు ఆహారం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారని చెప్పారు. అభివృద్ధిలోను రెండు రాష్ట్రాల్లో టీడీపీ చెరగని ముద్ర వేసిందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని, సాంకేతిక నగరంగా సైబరాబాద్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, సీడ్ పార్క్, విశాఖ మెడ్ టెక్ జోన్ అభివృద్ధి చేశామని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసి 38 అయ్యిందని, 22 అధికారం చేపట్టమని, 16 ఏళ్ళు ప్రతి పక్షంలో ఉన్నామని తెలిపారు. టీడీపీ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇతర రాష్ట్రాలు ఏ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు.

Tags
Back to top button
Close
Close