క్రీడలు

టీంలో మార్పులు: ఇంగ్లండ్ కెప్టెన్ మిస్టేక్.. భారత్ కు వరం..

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జోయ్ రూట్ తప్పుడు అంచనా ఆ జట్టుకు శాపంగా మారింది. ఉదయం పూట రెండు సార్లు వర్షం పడడంతో పిచ్ తడిగా ఉంటుందని.. టాస్ గెలవగానే ఇంగ్లండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. అదే అదృష్టం కలిసి వచ్చింది.

వర్షం పడిన పిచ్ పై భారత జట్టు పేకమేడలా కూలుతుందని అంతా అనుకున్నారు.అందుకే టాస్ గెలవగానే ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడి అంచనాలు తప్పాయి. రూట్ తీసుకున్న నిర్ణయం తప్పు అని మ్యాచ్ ప్రారంభమయ్యాక తేలింది. బ్యాటింగ్ కు దిగిన భారత బ్యాట్స్ మెన్ ఔట్ కాకుండా నిలకడగా ఆడుతున్నారు. పిచ్ ఏం ప్రమాదకరంగా లేదు. మొదట బ్యాటింగ్ చేయడం భారత్ కు వరం

తొలి 5 ఓవర్లలో కేవలం 6 పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ ఆ తర్వాత ఫోర్లతో స్కోరు బోర్డును నడిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ చెత్త బంతులను వదిలేస్తూ మంచి బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. ముఖ్యంగా సామ్ కర్రన్ బౌలింగ్ లో రోహిత్ మూడు ఫోర్లు కొట్టి జోష్ మీదనున్నాడు. 19 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 46 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్లు ఫర్వాలేదనిపించేలా ఆడుతున్నారు.

భారత జట్టులో ఒక మార్పు జరగగా.. ఇంగ్లండ్ టీం మూడు మార్పులు జట్టులో చేసింది. గాయపడ్డ శార్ధుల్ ఠాకూర్ స్థానంలో టీమిండియా సీనియర్ ఇషాంత్ శర్మను తీసుకుంది.దీంతో రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ కే పరిమితమయ్యాడు.

ఇక ఇంగ్లండ్ టీం ఫాంలో లేని, గాయపడ్డ వారిలో ముగ్గురిని తొలగించి వారి స్థానంలో మార్క్ వుడ్, మెయిన్ అలీ, హసీబ్ హమీద్ లను జట్టులోకి తీసుకుంది.

Back to top button