అప్పటి ముచ్చట్లు

ఆ కుర్రాడు నచ్చాడా..ఏమిటి నిజమే?

charan raj
గొప్ప దర్శకుడు టి.కృష్ణ ‘ప్రతిఘటన’ సినిమా చేయాలని, కథ అనుకుని సినిమాని మొదలుపెడుతున్న రోజులు అవి. అనుకోకుండా టి.కృష్ణ ఓ కన్నడ సినిమా చూశారు. ఆ సినిమాలో ఒక కుర్రాడు బాగా హైట్ వెయిట్ తో మంచి బలంగా కనిపించాడు. ఎందుకో టి.కృష్ణకు ఆ కుర్రాడు బాగా నచ్ఛాడు. అప్పట్లో గొప్ప గొప్ప ఆర్టిస్ట్ లే టి.కృష్ణకు నచ్చరు అనే పేరు ఒకటి ఉంది, అలాంటది, ఎదో కన్నడ సినిమాలో కనిపించిన కుర్రాడు నచ్చాడా ? ఏమిటి నిజమే ? నిర్మాతలు అనుమానంతో కూడుకున్న ప్రశ్న ఇది ?. సరే స్టార్ డమ్ ఉన్న టి.కృష్ణ చెప్పిన తరువాత, ఇక ఏ నిర్మాతకి కాదు అనే దైర్యం లేదు కాబట్టి,

దాంతో ఆ కుర్రాడి కోసం కన్నడ పరిశ్రమలో వెతకడం మొదలుపెట్టారు. ఎలాగోలా ఆ కుర్రాడిని వెతికి పట్టుకుని.. తెలుగు సినిమాలో ఓ టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలి అని వివరంగా వివరించారట. అయితే విచిత్రంగా ఆ కుర్రాడు మాత్రం.. నేను చేయను అని తేల్చి చెప్పేశాడు. మొత్తం కెరీర్ నే మలుపు తిప్పే ‘ప్రతిఘటన’ లాంటి గొప్ప సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదని చెప్పిన.. ఆ నటుడే ‘చరణ్ రాజ్’. నిజానికి కన్నడంలో చరణ్ రాజ్ అప్పటికే ఆరు సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అలాంటి సమయంలో ‘ప్రతిఘటన’ సినిమాలో విలన్ గా చేయమని టి.కృష్ణ అడిగారు.

మొదట చరణ్ రాజ్ రిక్వెస్ట్ చేస్తూ.. ‘నేను హీరోగా చేస్తున్నాను. ఇప్పుడు విలన్ గా చేస్తే.. నా కెరీర్ కి రిస్క్, అందుకే మీరు చెప్పే విలన్ పాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. నా ఇమేజ్ పాడవుతుంది’ అని ఆందోళనగా చెప్పాడట. కానీ టి కృష్ణ వినలేదు. కన్నడలో ఓ పెద్ద నిర్మాత రికమండేషన్ తో మొత్తానికి ‘చరణ్ రాజ్’ ఒప్పుకునేలా చేసారు. అందుకే మొదటి రోజు షూటింగ్ కు కూడా చరణ్ రాజ్ అయిష్టంగానే వెళ్ళాడట.

పైగా సినిమా అయ్యిపోయేంత వరకూ నేను విలన్ పాత్రకు సెట్ కాను అని టి.కృష్ణకు చెబుతూ ఉండేవారట. కానీ సినిమా ఫస్ట్ కాపీ చూశాకా చరణ్ రాజ్ నటన చూసి టి కృష్ణ ఎంతో అభినందించారట. తన నటనకు అందరు చప్పట్లు కొట్టి అభినందించారట. ఇక ఆ తరువాత నుండి తెలుగులో అందరు హీరోలతో నటించాడు చరణ్ రాజ్. అలాగే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భోజపురి భాషల్లో కూడా సినిమాలు చేసి తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకున్నాడు.

Back to top button