టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ధనుష్‌ పై హైకోర్టు సీరియస్.. ఈ హీరోలకు ఏమైంది ?

Dhanushకోట్లు తీసుకునే తమిళ స్టార్ హీరోలు లక్ష రూపాయల పన్ను కట్టడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. స్టార్‌ హీరో ధనుష్‌ 2015లో అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారును కొనుగోలు చేసి. దానికి పన్ను కట్టలేదు. విదేశాల నుంచి ఆ కారును దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను తక్కువే. అయినా, తనకు ఆ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ధనుష్ కోరుకోవడమే అన్యాయం అనుకుంటే.. అతగాడు పన్ను కట్టను అంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే, తాజాగా ధనుష్‌ వేసిన పిటిషన్‌ ను పరిశీలించింది హైకోర్టు. ధనుష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమాజంలో ఒక స్థాయిలో ఉండి… ఇలాంటి న్యాయపరమైన విషయాన్ని కూడా ఎందుకు పొగిడిస్తున్నారు ? అయినా లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు అడిగితే ఎలా ? అంటూ ధనుష్‌ పై సీరియస్ అవుతూనే హైకోర్టు అతన్ని నిలదీసింది.

అయితే, ధనుష్ ఈ అంశం పై మాట్లాడుతూ.. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. హీరో విజయ్‌ కూడా పన్ను కట్టలేదు. ఇటీవల కోర్టు విజయ్ కు పన్ను కట్టనందుకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. అసలు ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి చిన్న విషయాల్లో వార్తల్లో నిలవడం హీరోలకే అవమానం.

అసలు ‘సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు.. ఈ హీరోలకు ఇబ్బంది ఏమిటో వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఒక్కో సినిమాకి ఏభై కోట్లు వరకు తీసుకుంటారు. కానీ పన్ను కట్టరట. ఇకనైనా ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు కోర్టులు ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Back to top button