తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

చెరుకు శ్రీనివాసరెడ్డి అరెస్టు

Cheruku Srinivasareddy arrested in siddipeta.

దుబ్బాకలో ఇటీవల కాంగ్రెస్ తరుపున పోటీచేసిన చెరుకు శ్రీనివాసరెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లాలోని తొగుట మండలం మల్లన్న సాగర్ భూబాధితులు శనివారం ఆందోళన చేశారు. వారికి మద్దతునిచ్చిన చెరుకు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో ఎన్జీటి నుంచి అనుమతులు తీసుకోలేదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు కేవలం రూ. లక్షా యాభై వేల రూపాయలు మాత్రమే ఇస్తోందన్నారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు రావడంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తంగా మారడంతో చెరుకు శ్రీనివారెడ్డి సహా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Back to top button