వ్యాపారము

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. కిలో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధర 306 రూపాయలుగా ఉండగా తెలంగాణలో కిలో చికెన్ ధర 260 రూపాయలుగా ఉండటం గమనార్హం. కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కిలో చికెన్ 300 రూపాయలకు పైగా పలకడం తొలిసారని ఫౌల్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా విజృంభణ తర్వాత చికెన్ రేట్లు భారీగా తగ్గాయి.

చికెన్ తింటే కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో చికెన్ తినేవాళ్ల సంఖ్య తగ్గింది. ఆ తరువాత రాజకీయ, సినీ ప్రముఖులు చికెన్ తింటే కరోనా రాదని ప్రచారం చేయడంతో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతూ ఉండటటంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే కిలో చికెన్ 300 రూపాయలు పలకడం తొలిసారని ఫౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడటం కూడా చికెన్ ధర పెరగడానికి కారణమని తెలుస్తోంది. వేసవిలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుందని మేత ఎక్కువగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయని ఫౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫారాల్లో పెరుగుతున్న కోళ్లలో 10 నుంచి 15 శాతం కోళ్లు చనిపోతూ ఉండటం గమనార్హం. డిమాండ్ కు సరిపడినన్ని కోళ్లు లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

మరో రెండు మూడు వారాలలో కోళ్ల ధరలు తగ్గుతాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. మార్చి మూడో వారం నుంచి చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు కిలో మటన్ 700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు పలుకుతున్నట్టు తెలుస్తోంది.

Back to top button