కరోనా వైరస్ప్రత్యేకంవైరల్

కరోనా పుట్టింది ఇటలీలోనే.. సాక్ష్యాలు చూపించిన చైనా..?

భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. అయితే కరోనా వైరస్ తమ దేశంలో పుట్టలేదని చైనా చెబుతుండటం గమనార్హం. ఒక కొత్త అధ్యయనం ద్వారా కరోనా వైరస్ ఇటలీ నుంచి చైనాకు వ్యాప్తి చెందిందని వైరస్ వ్యాప్తిలో చైనా తప్పేం లేదని డ్రాగన్ చెబుతోంది.

కొత్త అధ్యయన నివేదికల ద్వారా కరోనా వైరస్ ఇటలీలోనే మొదట పుట్టిందని.. ఇటలీలో సెప్టెంబర్ నెల మొదట్లోనే ఈ వైరస్ పుట్టి ఉండవచ్చని అక్కడినుంచి చైనాలోని వుహాన్ సిటీకి వైరస్ వ్యాప్తి చెందిందని చైనా చెబుతోంది. నేషనల్ కేన్సర్ ఇన్సిస్ట్యూట్ కొత్త అధ్యయనం ఆధారంగా ఈ విషయాన్ని చైనా వెల్లడిస్తోంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం చైనా తమ దేశంపై పడిన నిందను చెరిపేసుకునేందుకు ఈ విధంగా చేస్తోందని భావిస్తున్నారు.

కరోనా వైరస్ చైనాలోని జంతువుల నుంచి వ్యాప్తి చెందిందని కొందరు, వుహాన్ లోని ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వుహాన్ లో కరోనా వైరస్ విజృంభించడానికి ముందే ఎక్కడైనా వ్యాప్తి చెంది ఉండవచ్చని అనుమానాలను వ్యక్తం చేస్తోంది. మరోవైపు భారత్ లో క్రమంగా కరోనావైరస్ తగ్గుముఖం పడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోగా త్వరలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచ దేశాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Back to top button