టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మెగాస్టార్ తో పాటు దిల్ రాజు కూడా వెళ్ళాడు !

Chiranjeeviసక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తన “లూసిఫర్” రీమేక్ ను స్టార్ట్ చేయనున్నారు. ఒక విధంగా చిరు ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లోనే మంచి క్రేజ్ ఉన్న సినిమా ఇది. అందుకే ఈ సినిమా విషయంలో చిరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

మోహన్‌ రాజా దర్శకత్వంలో వస్తోన్న ఈ రీమేక్‌ కోసం మెగాస్టార్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా చికిత్స తీసుకునేందుకు విశాఖపట్నం వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతకీ చిరు ఏ ట్రీట్మెంట్ కోసం వైజాగ్ వెళ్లారు అంటే…నేచర్‌క్యూర్‌ ఆయుర్వేద చికిత్స కోసం. వైజాగ్‌ లో ఓ ప్రముఖ ఆయుర్వేదిక్‌ స్పా సెంటర్‌ లో డీటాక్సిఫికేషన్‌, రెజువెనేషన్‌ ప్రక్రియ చాలా బాగా చేస్తారట.

అందుకే, చిరు అక్కడికి వెళ్లారు. అక్కడే పది రోజులు పాటు ఉంటారు. మొత్తం ఈ పక్రియ పూర్తి అయిన తర్వాత నుండి లూసిఫర్‌ షూటింగ్‌ లో జాయిన్ అవుతారు. ఇక చిరుతో పాటు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కూడా చికిత్స కోసం వైజాగ్ వెళ్లారట. అలాగే వీరి వెంట మరో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని సమాచారం.

అన్నట్టు గతంలో కూడా చిరంజీవి బాడీ డిటాక్సిఫికేషన్‌ చేయించుకునేందుకు వైజాగ్‌ వెళ్లారు. అసలు ఈ డీటాక్సిఫికేషన్ అంటే ఏమిటంటే.. అలసట నుంచి శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రక్రియ. దీన్నే డీటాక్సిఫికేషన్ అని పిలుస్తారు. పురాతన ప్రాచుర్యం కలిగిన వైద్యం ఇది. నేటి సమాజంలో ఎవరికైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాగే కాలుష్యం కారణంగా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి.

ఆ ఒత్తిడిని, ఆ వ్యర్థాలను తీసేసే ప్రక్రియయే ఈ డీటాక్సిఫికేషన్. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు రిలాక్సేషన్ కోసం ఈ ఆయుర్వేదిక్ డిటాక్సిఫికేషన్ వైద్యాన్ని చేయించుకుంటారని తెలుస్తోంది. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఈ డీటాక్సిఫికేషన్ వైద్యాన్ని చేయించుకుంటారు. మరి త్వరలోనే సామాన్య జనానికి ఇది అందుబాటులో రావాలని ఆశిద్దాం.

Back to top button