టాలీవుడ్సినిమా

అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !


మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం గురించి రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. కానీ, అందరి హీరోలు లాంటి హీరో కాదు మెగాస్టార్. ప్లాప్ ల్లో ఉన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి తనకున్న భారీ మార్కెట్ ను పోగొట్టుకునేంత తెలివితక్కువ పని ఇంకొక్కటి ఉండదు. ఈ జనరేషన్ హీరోలు నిజంగా అలా ఎవ్వరూ చెయ్యరు. కానీ ముందు జనరేష్ స్టార్ల రూటే సెపరేట్. తనవాడు అనుకుంటే చాలు.. ఆ డైరెక్టర్ కెరీర్ ముగిసిపోయినా ఛాన్స్ లు ఇచ్చి వారిని ఆదుకుంటారు. ఇలాంటివి చేయడంలో బాలయ్య ముందుంటాడు. అందుకే ప్లాప్ ల్లో కూడా బాలయ్యకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ లు ఇలాంటి అవకాశాలు ఇచ్చే వచ్చాయి. ఇక మెగాస్టార్ కూడా ఇలా కొన్ని ఛాన్స్ లు ఇచ్చినా.. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దర్శకుడు వినాయక్ కి సినిమా లేక హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఎవ్వరూ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా వినాయక్ మార్కెట్ కూడా పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి అవకాశం ఇచ్చారట. తానూ యంగ్ స్టార్ డైరెక్టర్ సుజీత్ తో చేస్తోన్న ‘లూసిఫర్‘ సినిమాను వినాయక్ చేతిలో పెడుతున్నారట. కాగా ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం.. వినాయక్ ఖైదీ సినిమా టైంలోనే మెగాస్టార్ కి మరో కథ చెప్పారట. అయితే మెగాస్టార్ మాత్రం తన మేనల్లుడు సాయి తేజ్ తో ఒక సినిమా చేసి పెట్టమని అడిగారట.

అలా వినాయక్ – సాయి తేజ్ కాంబోలో ఇంటిలిజెంట్ అనే భారీ ప్లాప్ సినిమా బయటకు వచ్చింది. ఆ సినిమా నుండే వినాయక్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఒకరకంగా ఆ సినిమా చేయడానికి మెగాస్టారే కారణం. అందుకే ఇప్పుడు పిలిచి ఛాన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఇచ్చారంటే అది నిజంగా మెగాస్టార్ గొప్పతనమే. ఇక ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ను చూసిన వినాయక్, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేస్తే బాగుంటుందని మెగాస్టార్ కి చెప్పినట్లు తెలుస్తోంది. వినాయక్ డైరెక్షన్ చేస్తే ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ అన్ని హైలైట్ గా వస్తాయి. ఆ రకంగా మెగా అభిమానులకు ఇది ఫుల్ జోషే.

Tags
Show More
Back to top button
Close
Close