టాలీవుడ్సినిమా

భారీ ప్లాప్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్.. కారణం ?


దర్శకుడు మెహ‌ర్ రమేష్ ఎన్టీఆర్ ను రెండు సార్లు, ప్రభాస్ ను ఒకసారి డైరెక్ట్ చేశాడు. తన కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేకపోయినా తీసిన సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలే. అలాగే ఆ సినిమాలు చివరకు భారీ ప్లాప్ చిత్రాలుగా నిలిచాయనుకోండి. దాంతో మెహ‌ర్ రమేష్ సినీ కెరీర్ కి పెద్ద బ్రేక్ పడిపోయింది. సినిమా తీసి ఇప్పటికే దాదాపు ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలాంటి డైరెక్టర్ కి నిజంగా ఏ స్టార్ హీరో పిలిచి సినిమా ఇవ్వడం అనేది అసంభవం. కానీ, మెగాస్టార్ చిరంజీవి మెహ‌ర్ రమేష్ కి లైఫ్ చేంజింగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. మెగాస్టార్ తో చేయబోయే సినిమా హిట్ అయితే మెహ‌ర్ రేంజ్ మారిపోనుంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఆచార్య‌ తరువాత మెహ‌ర్ రమేష్ సినిమానే ఉండొచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Also Read: ‘ఆచార్య’తో అమ్మ కలను నెరవెరుస్తున్న చరణ్..!

వేదాళం రీమేక్ నే వీళ్ళు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా మెహ‌ర్ ర‌మేష్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం మెహర్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే భారీ ప్లాప్ డైరెక్టర్ గా బలమైన ముద్ర పడిపోయిన మెహ‌ర్ ర‌మేష్ కి ఈ పెద్ద ఆఫ‌ర్ మెగాస్టార్ ఎందుకిచ్చిన‌ట్లు అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల‌తో ప్లాప్ సినిమాలు చేసినా.. ఒక దర్శకుడిగా అతను బాగానే డైరెక్ట్ చేశాడు. కాకపోతే తను చేసిన సినిమాలేవి క‌మ‌ర్శియ ల్ గా స‌క్సెస్ కాకపోవడంతో మెహర్ కి ప్లాప్ డైరెక్టర్ అనే పేరు వచ్చేసింది. మెహర్ సినిమాల్లో క‌మ‌ర్శియ‌ల్ హంగులు బాగానే జొప్పిస్తాడు. పైపెచ్చు భారీ బ‌డ్జెట్ సినిమాలను చేసిన అనుభవం ఉంది. ఆయన సినిమాలు నిర్మాత‌ల్ని ఆర్ధికంగా దెబ్బ‌తియొచ్చు. కానీ హీరోలను మెహర్ కొత్తగానే చూపించాడు.

Also Read: పవన్ కు అవమానం.. పోలీస్ గడపతొక్కిన జనసేన

దీంతోనే మోహ‌ర్ ర‌మేష్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడట. అసలు వేదాళం స్ర్కిప్ట్ ను మెగాస్టార్ తీసుకుందే మెహ‌ర్ కోసమట. మెహ‌ర్ ర‌మేష్ మెగా కుటుంబానికి అతి ద‌గ్గ‌ర బంధువు. పైగా అతను ఇండస్ట్రీలోకి రావడానికి మెగాస్టారే కారణమట. ఈ విష‌యాన్ని ఆ మధ్య మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ వేదిక‌పై ప‌బ్లిక్ గానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మెహర్ కి మెగా కుటుంబం సన్నిహితం అయినా.. అతను తన మొదటి రెండు సినిమాలను ఎన్టీఆర్ తోనే చేశాడు. అప్పటినుండే మెగాహీరోలకు అతనికి గ్యాప్ పెరిగింది. ఆ తరువాత మెహర్ కి హిట్ లేకపోవడంతో ఎవ్వరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. కనీసం ఒక్క సినిమా హిట్ అయినా, మెగా హీరోలు మెహ‌ర్ కి ఛాన్స్ ఇచ్చేవారేమో. కానీ ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి మెహర్ ఛాన్స్ ఇచ్చి.. అతని జీవితాన్ని నిలబెట్టడానికి సన్నద్ధం అవుతున్నారు. చిరంజీవి 152వ సినిమా మరియు మెహర్ సినిమా త‌ర్వాత మ‌రో రెండు..మూడు సినిమాలు కూడా వెంట‌నే చేయ‌నున్నారు. ఆ సినిమాల్లో వినాయక్ సినిమా కూడా ఉంది.

Back to top button