గుసగుసలుటాలీవుడ్సినిమా

వెబ్ సీరిస్ లో మెగాస్టార్?


మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న మెగాస్టార్ ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. తన అనుభవాలతోపాటు సామాజిక అంశాలపై స్పందిస్తూ మెగా అభిమానులను అలరిస్తున్నారు. డిజిటల్ రంగంలో వస్తున్న అనూహ్య మార్పులను ఆయన గమనిస్తూనే ఉన్నారు. వెండితెరతో మెగాస్టార్ గా ఆకట్టుకున్న చిరంజీవి బుల్లితెరపై హోస్ట్ గా చేసి అందరినీ అలరించారు. ప్రస్తుతం వెబ్ సీరిస్ ల హవా నడుస్తుండటంతో మెగాస్టార్ చూపు అటువైపు పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన త్వరలోనే ఓ వెబ్ సీరిస్ లో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

విశాఖలో భారీ ప్రమాదం…!

ప్రస్తుతం ప్రతీఒక్కరికి ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రతీఒక్కరు స్మార్ట్ ఫోన్లలో సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త వెబ్ సీరిస్ లను రూపొందిస్తున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుంది. వీటిలో ప్రముఖ నటీనటులు నటించడంతో అత్యధిక రేటింగ్స్ వస్తున్నాయి. వీరికి భారీ మొత్తంలో పారితోషికం రావడంతోపాటు క్రేజీ ఫాలోయింగ్ లభిస్తుంది. దీంతో వెబ్ సీరిస్ లలో నటించేందుకు తారలు మొగ్గుచూపుతున్నారు.

జగన్ విశాఖ ప్రయాణం!

ఇప్పటికే ఈ వెబ్ సీరిస్ లో కియారా అడ్వానీ నటించి యూత్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలీవుడ్లో హీరోయిన్ గా నటిస్తున్నానే వెబ్ సీరిస్ లో నటిస్తూ రెండుచేతుల సంపాదిస్తుంది. దక్షిణాది విషయానికొస్తే కాజల్ అగర్వాల్, సమంత, రమ్యకృష్ణ, నమిత తదితరులు వెబ్ సీరిస్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల అల్లు అరవింద్ ‘ఆహా’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ రూపొందించారు. ‘ఆహా’ ప్రమోషన్స్ భారీగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ వెబ్ సీరిస్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందుకు మెగాస్టార్ కూడా సానుకూలంగా ఉండటంతో త్వరలో మెగాస్టార్ వెబ్ సీరిస్ నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.