సినిమాసినిమా వార్తలు

చిరంజీవి.. ఈసారి అంతకుమించి అట.?

Chiranjeevi - Prabhu Deva Movie Sets Up

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్రహీరో అయినా కూడా ఇప్పటిదాకా అగ్ర దర్శకులు ఈయనతో సినిమాలు చేయడానికి పెద్దగా ముందుకు రాలేదనే చెప్పాలి. దక్షిణాది అగ్రదర్శకుడు శంకర్ కానీ.. టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కానీ ఎప్పుడూ చిరంజీవితో సినిమాలు చేయలేదు. ఆయన కుమారుడు రాంచరణ్ తో మాత్రం చేస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం కొత్తగా దూసుకొస్తున్న దర్శకులతో మంచి కథలను తీసుకొని సినిమాను రూపొందిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ అగ్రదర్శకుడు కొరటాల శివతో చిరంజీవి తీసిన ‘ఆచార్య’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆ తర్వాత ‘లూసీఫర్’, వేదాళం రిమేక్ లున్నాయి. ఇక బాబీ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇక ఇటీవల మారుతి చెప్పిన కథకు కూడా చిరంజీవి ఓకే చెప్పాడని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ లైన్లో ఉండగానే చిరంజీవికి మరో ఆఫర్ వచ్చిందట.. తాజాగా నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో సినిమాకు చిరంజీవి రెడీగా ఉన్నాడని తెలుస్తోంది.

రీమేక్ లు బాగా తీస్తాడని ప్రభుదేవాకు పేరుంది.తెలుగు హిట్ సినిమాల రిమేక్ లు బాలీవుడ్ లో తీసి ప్రభుదేవ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రిమేక్ బాధ్యతను ప్రభుదేవకు చిరంజీవి అప్పగించారని టాక్. ఇప్పటికే ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ప్రభుదేవా-చిరంజీవి కలిసి పనిచేశారు. ఇప్పుడు మరోసారి జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Back to top button