టాలీవుడ్సినిమా

అభిమానికి అండగా చిరంజీవి


అభిమానులు కోసం నిరంతరం ఆలోచిస్తానని మరో మారు చిరంజీవి ప్రూవ్ చేసుకొన్న ఉదంతం ఒకటి తాజాగా జరిగింది. గుంటూరు జిల్లా ” చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ ” అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గారు గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆ విషయాన్ని వేరేవారి ద్వారా తెలుసుకున్నమెగా స్టార్ చిరంజీవి నాగలక్ష్మి మెడికల్ రిపోర్ట్స్ తెప్పించు కోవడం జరిగింది. తర్వాత హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ , ఎండి అయిన ఫేమస్ హార్ట్ సర్జన్ Dr గోపీచంద్ గారి ద్వారా ఆమె యొక్క జబ్బు తీవ్రతను తెలుసుకోడం జరిగింది.

వెంటనే హుటాహుటిన నాగలక్ష్మి గారిని హైదరాబాద్ కు రప్పించే ఏర్పాట్లు చేయడంతో పాటు , ఆపరేషన్ కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది . కాగా నేడు నాగలక్ష్మి ఆపరేషన్ జరపటానికి సర్వం సిద్ధం అయ్యింది. తనను అమితంగా ఆరాధిస్తున్న అభిమాని ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న చిరంజీవి గారి మంచి మనసుని అందరూ పొగడ్తలతో ముంచెత్తు తున్నారు . ఇప్పటికే .కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సి సి సి ద్వారా సినీ కార్మికులకు విశేష సేవలు అందిస్తున్న చిరంజీవి తన అభిమాని విషయంలో తీసుకొంటున్న శ్రద్ద కి హాట్స్ ఆఫ్ అనక తప్పదు.

ఈ ఏడాది జనవరి లో హైదరాబాద్ కి చెందిన చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ చనిపోయిన సందర్భంలో కూడా చిరంజీవి ఇదే రీతిలో స్పందించడం ఆ తరవాత రామ్ చరణ్ వెళ్లి నూర్ అహ్మద్ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు అందించడం, ఆ కుటుంబానికి అండగా మేముంటామని భరోసా ఇవ్వడం జరిగింది .