టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

పవన్ సినిమా పై మెగాస్టార్ ట్వీట్ వైరల్ !

chiranjeevi vakeel saab
పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “వకీల్ సాబ్” ఘనంగా చాటి చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ అనే మరోసారి రుజువు చేశాడు. మొత్తానికి తానూ వకీల్ సాబ్ ను కాదు, బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తమ మాతృమూర్తి అంజనాదేవి గారితో సహా వెళ్లి “వకీల్ సాబ్” సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘మూడేళ్లు అయినా కూడా పవన్ లో అదే వేడి, అదే వాడి, అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ డ్రామా అయితే అద్భుతం. అలాగే కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు నటీమణులు నివేతా థామస్ మరియు అనన్య నాగళ్ళ, అంజలిలు వారి పాత్రల్లో జీవించారు.

చిరు తన ట్వీట్ లో సాంకేతిక బృందం గురించి ప్రస్తావిస్తూ.. ‘దిల్ రాజు, బోనికపూర్,దర్శకుడు వేణు శ్రీరామ్ మిగతా టీమ్ కి నా శుభాకాంక్షలు. థమన్, సినిమాటోగ్రఫర్ వినోద్ ప్రాణం పోశారు. అన్నిటికీ మించి ఈ చిత్రం మహిళలకు ఇవ్వలిన గౌరవాన్ని తెలియజేసే అత్యవసర చిత్రం. ‘వకీల్ సాబ్’ కేసులనే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు’ అంటూ మొత్తానికి చిరు అదిరిపోయే ట్వీట్ చేశారు.

Back to top button