అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

పవన్ ను సీఎం చేయడానికి చిరంజీవి పెద్ద ప్లాన్?

Chiranjeevi's plan to make Pawan CM?

తాను సాధించనిది.. తన వారసులు సాధించాలని చాలా మంది ఉబలాటపడుతుంటారు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే స్కెచ్ వేశారట.. రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పెట్టి అట్టర్ ఫ్లాప్ అయిన చిరంజీవి.. తన కోరికను తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకునేందుకు రెడీ అయ్యారట.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాక ఇక ఈ పాలిటిక్స్ కు దూరంగా చిరంజీవి సినిమాలు చేసుకుంటున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అంతకుమించిన వ్యవహారం నడుపుతున్నారని తాజాగా తేలింది.

ఇన్నాళ్లు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు చిరంజీవి మద్దతు లేదని మెగా ఫ్యాన్స్ రంది పెట్టుకున్నారు. కానీ తమ్ముడు పవన్ రాజకీయ అడుగులు వెనుక చిరంజీవియే ఉన్నారని.. ఆయన సినిమా, రాజకీయ జీవితాలను తీర్చిదిద్దుతున్నారని తాజాగా జనసేనలో నంబర్ 2 నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని.. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించడానికి కష్టపడుతున్నారనే విషయం ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

తాజాగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఇస్తామని చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చిరంజీవి సూచనలు తీసుకుంటున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

“మెగాస్టార్ట్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నాడు. ఎప్పుడూ పవన్ కు అండగా ఉంటాడు” అని నాదెండ్ల నొక్కి చెప్పడం విశేషం. చిరంజీవి సలహా మేరకే పవన్‌కళ్యాణ్‌ మళ్లీ సినిమాలు చేస్తున్నారని నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పవన్ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేయాలని చిరంజీవి సూచించారు. పవన్ తన అన్నయ్య సలహాను అనుసరిస్తున్నాడు”అని నాదెండ్ల చెప్పాడు.

పవన్‌కు చిరంజీవి నైతిక మద్దతు ఇస్తున్నారని, తన సోదరుడికి మద్దతుగా ఖచ్చితంగా బహిరంగంగా బయటకు వస్తానని హామీ ఇచ్చారని నాదెండ్ల తెలిపారు. నాదెండ్ల చెప్పినది కనుక నిజంగా నిజమైతే అది జనసేనకు పెద్ద ధైర్యాన్ని ఇస్తుందని.. ఏపీలో కాపులందరినీ దగ్గరికి చేర్చి రాజకీయ అధికారం దిశగా నడిపిస్తుందని ఆశపడుతున్నారు. అయితే “మెగాస్టార్ ఒకవేళ ఏపీలో క్లిక్ అయితే జనసేన ద్వారా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలున్నాయని జనసేన నేతలు భావిస్తున్నారు. పవన్ ను సీఎం చేయడానికే చిరంజీవి ఈ స్కెచ్ గీశాడని కూడా అంటున్నారు.

అయితే దీనిపై చిరంజీవి నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చిరంజీవి స్పందిస్తే కానీ జనసేనకు ఆయన మద్దతు ఉందా? తమ్ముడు వెనుకలా ఆయన ఉన్నాడా అన్నది తెలియదు.

Back to top button