టాలీవుడ్ప్రత్యేకంసినిమాసినిమా రివ్యూస్సినిమా వార్తలు

రివ్యూ : ‘సినిమా బండి’ – అమాయకుల సినిమా జర్నీ !

Cinema Bandiనటీనటులు : వికాస్ వశిష్ఠ, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర త‌దిత‌రులు.
దర్శకత్వం : ప్రవీణ్‌ కండ్రెగుల
సంగీతం : శిరీశ్‌ సత్యవోలు
స్క్రీన్ ప్లే : ప్రవీణ్‌ కండ్రెగుల
నిర్మాతలు : రాజ్‌ అండ్‌ డీకే
రేటింగ్ : 3.25

తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సినిమా బండి’ అనే సినిమాతో తమ నిర్మాణంలో ఓ సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ప్రవీణ్ కాండ్రేగుల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ అతని దర్శకత్వంలో సినిమా బండి అనే ఫుల్ ఇన్నోసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేశారు. ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథాకమీషు :

వీర బాబు (వికాస్ వశిష్ఠ) అనే ఆటోడ్రైవర్‌ కి ఒక మూవీ కెమెరా దొరుకుతుంది. జీవితంలో మొదటిసారి అంత పెద్ద కెమరా చూసిన అతను, మొత్తానికి సినిమా చేయాలని బలంగా నిర్ణయించుకుంటాడు. సినిమా తీసి ఒకేసారి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనేది అతని ఆశ. దాంతో గణపతి అనే పెళ్లిల ఫోటోగ్రాఫర్ ను కెమెరామెన్ గా తీసుకుని, సెల్యూన్ షాప్ మర్దేశ్ బాబును హీరోగా, కూరగాయలు అమ్ముకునే మంగను హీరోయిన్ గా పెట్టి సినిమా స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా ఫోటో కూడా తీయడమే రాని వీళ్ళు, సినిమా ఎలా తీశారు ? ఈ క్రమంలో వీళ్ళు పడిన కష్టాలు ఏమిటి ? తమకు వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు ? ఇంతకీ సినిమా తీసారా ? లేదా ? అసలు ఆ దొరికిన కెమెరా ఎవరిదీ ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉంది ?

క్లుప్తంగా ముచ్చటించుకుంటే సినిమాలో అమాయకత్వపు పాత్రలు చేసే సున్నితమైన హాస్యం, అలాగే ఆ స్వచ్ఛమైన మనస్తత్వాలు మధ్య రగిలే సంఘర్షణలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకి ప్రధానంగా బలం ఈ సినిమా కథ జరిగిన నేపధ్యమే. సినిమా చూస్తున్నంత సేపు వీరబాబు, గణపతి ఉంటున్న ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అలాగే దర్శకుడు ప్రవీణ్ రాసుకున్న సున్నితమైన హాస్యం కూడా సినిమా స్థాయిని పెంచింది.

పైగా భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన హాస్యాన్ని పండించడం అంటే మాటలు కాదు. ఆ విషయంలో దర్శకుడు ప్రవీణ్ అబ్బురపరిచారు. ఇక హీరోగా నటించిన వికాస్ వశిష్ఠ, అలాగే మరో నటుడు సందీప్ వారణాసి కూడా తమ పాత్రల్లో అద్భుతమైన నటన కనబర్చారు. మిగిలిన నటీనటులు నటన కూడా మనల్ని నవ్విస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

కథ,
నేపథ్యం,
పాత్రల చిత్రీకరణ,
హాస్యం,
సహజమైన సన్నివేశాలు,
సంగీతం,
నటీనటుల నటన.

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగే కొన్ని సీన్స్.
ప్యాడింగ్ లేకపోవడం.

చివరి మాట :

ఇలాంటి సహజమైన చిత్రాన్ని కచ్చితంగా చూడాలి. హాయిగా గంట ముప్పై ఐదు నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. ‘కెమెరా వాడటం కూడా రాని ఓ అమాయకపు బ్యాచ్, ఓ ఫ్యూచర్ ఫిల్మ్ తీయడానికి పడిన పాట్లు బాగా నవ్విస్తాయి. ఈ లాక్ డౌన్ లో ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప రిలీఫ్ ను ఇస్తోంది.

Back to top button