జాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

Afghanistan: కాబుల్ లో భారత ఎంబసీ మూసివేత.. అధికారుల తరలింపు

Closure of the Indian Embassy in Kabul

తాలిబన్ల అధీనంలోకి వచ్చిన అఫ్టానిస్థాన్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఈ మేరకు భారత్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కాబుల్ లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను తక్షణమే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరింధమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తీసుకొస్తున్నారు.

Back to top button