అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జర్నలిస్టులు ఏం పాపం చేశారు జగన్?

CM Jagan

సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే తనకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించిన ఏబీఎన్, టీవీ9లను తెలంగాణలో నిషేధించి అప్పట్లో పెను సంచలనమే సృష్టించారు. పెట్టుకుంటే అలా చానెల్స్, అధినేతలతో పెట్టుకోవాలి.. మీ పవర్ చూపించాలి.. కానీ ఏపీలో మాత్రం ట్రెయిన్ రివర్స్ లో ఉంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఏపీ సీఎం జగన్ తనకు వ్యతిరేకంగా రాస్తున్న మీడియా చానెల్స్, పత్రికలను ఏమీ చేయకుండా అందులో పనిచేసే జర్నలిస్టులపై పడడమే ఇప్పుడు జర్నలిస్టులను అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా ఏపీలో అక్రిడిటేషన్ల పేరిట అందరు జర్నలిస్టులను ఏపీ సర్కార్ ఏరివేయడంపై జర్నలిస్టులు అంతా భగ్గుమంటున్నారు.

2021 జనవరిలో కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమై ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో ఆశగా జర్నలిస్టులు అంతా దరఖాస్తు చేసుకున్నారు. కానీ అనేక నిబంధనలు అంటూ జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో జగన్ సర్కార్ భారీగా కోత విధించడంపై జర్నలిస్టులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టుల హక్కుగా తీసుకునే ఈ కార్డులపై ప్రభుత్వం పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు.

Also Read: హవ్వా.. బాలీవుడ్ కిడ్నాప్ సినిమా చూసి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ అట?

నకిలీ జర్నలిస్టుల పేరిట జరుగుతున్న ఈ తంతుతో నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వంలో ఉన్న జర్నలిస్టు మేధావులు ఎవరూ కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎల్లో మీడియా అధినేతలను ఢీకొనలేక.. వారు ఇచ్చే జీతాలపై ఆధారపడి వార్తలు రాసే అమాయకులైన జర్నలిస్టులపై జగన్ ప్రతాపం చూపడం న్యాయమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలో అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ జర్నలిస్టుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమన్వయ కమిటీలో జర్నలిస్టులకు చోటు కల్పించకపోవడంపై భారత ప్రెస్ కౌన్సిల్ (పీసీఐ) ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికైనా జర్నలిస్టులకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Back to top button