ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

ఆంధ్రజ్యోతి ఆర్కేకు షాకిచ్చిన జగన్!

CM Jagan shocks Andhra Jyoti Radhakrishna

ప్రతివారం ‘కొత్త పలుకు’ శీర్షికతో తన పత్రికలో ఫక్తు వైసీపీ మీద, జగన్ మీద కథనాలు రాస్తూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆంధ్రజ్యోతి పత్రికాధినేత రాధాకృష్ణ. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ ఆయన కూతురు చేసిన ఆరోపణలపై పెద్ద కథనమే రాశాడు. వైఎస్ జగన్ ను, వారి కుటుంబాన్ని టార్గెట్ చేశాడనే ఆరోపణలు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతి అన్నా రాధాకృష్ణ అన్నా వైసీపీ నేతలు రగిలిపోతున్నారు. ఎలాగైనా సరే రాధాకృష్ణకు బుద్ది చెప్పాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

ఇప్పటికే గత చంద్రబాబు ప్రభుత్వంలో రాధాకృష్ణ పత్రికకు విశాఖలో కేటాయించిన భూమిని వైఎస్ జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది. దీనిపై హైకోర్టుకు వెళ్లి రాధాకృష్ణ స్టే తెచ్చుకున్నాడు.

తాజాగా విశాఖలోని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ను వైసీపీ సర్కార్ టార్గెట్ చేసింది. ఓ గోడౌన్ లో పెట్టిన దీన్ని ఆగమేఘాల మీద విశాఖ నగరపాలక సంస్థ కూల్చేయడం చర్చనీయాంశమైంది. ఆ ప్రైవేటు గోడౌన్ లోనే ఆంధ్రజ్యోతి పత్రిక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అది అక్రమమని తెలిసి ఎలాంటి నోటీసుల్లేకుండా.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునే లోపే భారీ ప్రొక్రెయినర్లతో నేలమట్టం చేసేశారు.

ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న గోడౌన్ ఓనర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోపే పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేశారు. దాదాపుగా కూల్చివేత పూర్తయ్యింది. ఆంధ్రజ్యోతి విశాఖ పత్రికకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఏపీఐఐసీ భూముల్లో ఆ గోడౌన్లను నిర్మించారు. అయితే అనుమతించిన దానికంటే ఎక్కువగా కట్టారని అధికారుల ఆరోపణ. వాటిని ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు కలిసి కూర్చేశారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని కూల్చాల్సింది ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ అని తెలియగానే ఏలాంటి పద్ధతులు పాటించకుండా కూల్చేసి రాధాకృష్ణకు గట్టి షాక్ యే ఇచ్చారు.

ఎన్నో రోజులుగా అనుమతులు లేకుండా.. లేదా నిబంధనలకు విరుద్ధంగా గౌడౌన్ నడుస్తున్నా ఇప్పుడే ఇలా కూల్చివేయడం ఆ కథనాల ప్రభావమే అంటున్నారు విశ్లేషకులు. ఎంతైనా పగతో రగిలిపోతున్న వైసీపీ నేతలు ఆంధ్రజ్యోతి ఆర్కే ఎక్కడ దోరికినా పగ సాధిచేద్దాం అన్నట్టుగా ఉన్నారేమోనని గుసగుసలాడుకుంటున్నారు.

Back to top button