అత్యంత ప్రజాదరణగెస్ట్ కాలమ్జీహెచ్‌ఎంసీ ఎన్నికలుతెలంగాణరాజకీయాలు

సీఎం కేసీఆర్ vs భూపేందర్ యాదవ్.. ఎవరిది పైచేయి?

KCR Bhupendera Yadav

రాజకీయాల్లో రెండు ముఖాలుంటాయి. ఒకటి కనిపించే మొహం. రెండోది కనిపించని మొహం. ఈ రెండు మొహాలు ప్రతి పార్టీలోనూ కనిపిస్తుంటాయి. ప్రతి ఎన్నికల్లోనూ రెండూ పనిచేస్తుంటాయి. అయితే.. మొదటి మొహంతోనే ప్రతిపక్షాలు ఎప్పుడూ రాజకీయాలు చేస్తుంటాయి. మొదటి మొహంతోనే తలపడుతూ ఉంటాయి. రెండో మొహానిది ఎప్పుడూ రాణి పాత్రే. అచ్చు అలాగే రెండో మొహం అంతఃపురం నుంచే పాచికలు వేస్తుంటుంది. ఎప్పుడూ కనిపించదు. ఆ రెండో మొహమే వ్యూహకర్త. మొదటి మొహం ప్రచారాలు చేస్తూ.. రణరంగంలో చెలరేగిపోతుంది. రెండో మొహం మాత్రం ఎవరికీ కనిపించకుండా.. రాజకీయ ముఖ చిత్రంలో లేకుండానే అవసరమైన పాచికలు వేస్తూ కార్య క్షేత్రాన్ని మార్చేస్తుంటుంది.

Also Read: పొద్దున బీజేపీలోకి.. రాత్రికి టీఆర్ఎస్ లోకి.. కాపుకాస్తున్న హరీష్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డి తదితర నేతలు బయటికి కనిపిస్తున్నా.. మొత్తం వ్యూహాన్ని తయారు చేసేది భూపేందర్ యాదవ్‌. ఈ నేతలు ప్రచారంలో వాగ్ధాటితో విరుచుకుపడే సత్తా ఉన్నా… అటు వాగ్ధాటితో పాటు పాచికలు వేయడం కూడా రావాలి. ఈ రెండు లక్షణాలున్న నేతలుండటం చాలా అరుదు. బీజేపీ రాష్ట్ర నేతల్లో పాచికలు వేయడం, రాజకీయ వైరి పక్షాన్ని ఆ ముగ్గులోకి లాగడం లాంటి విద్యను తెలిసిన నేతలు లేరు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇప్పుడు ‘పాచికల’ చుట్టూ తిరుగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. దుబ్బాక ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకొని ఊపుమీదున్న బీజేపీ జీహెచ్ఎంసీలోనూ పాగా వేయాలని సీరియస్‌గా కంకణం కట్టుకుంది. ఈ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గానే తీసుకుంది. సాక్షాత్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహకర్త భూపేంద్ర యాదవ్‌ను రంగంలోకి దించింది అధిష్ఠానం. భూపేందర్ యాదవ్ బీజేపీలో చాప కింద నీరులా విజృంభిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అధిష్ఠానం ఆయన్ను అక్కడికి పంపిస్తుంటుంది.

Also Read: పవన్ మిత్రుడి వరకేనా.. పొత్తుకు పనికిరాడా..?

‘పాచిక’ అవసరం ఉండదని కేసీఆర్ భావించి ఉంటారు. కానీ బీజేపీ విజయంతో ‘పాచిక’ వేయాల్సిన అవసరం కేసీఆర్‌కు సంభవించింది. అటు వాగ్ధాటి, ఇటు పాచిక వేయడం రెండూ తెలిసిన వ్యక్తి కేసీఆర్. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలో అంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అటు భూపేందర్ యాదవ్, ఇటు సీఎం కేసీఆర్.. ఇలా రెండు పాచికలు ఒకదానితో ఒకటి సంఘర్షణ పడుతున్నాయి కాబట్టే… జీహెచ్‌ఎంసీ రాజకీయం ఇంత రంజు మీద సాగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button