విద్య / ఉద్యోగాలు

పరీక్ష లేకుండా కోల్ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో..?

Coal India Limited Recruitment 2021

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 22 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 19 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 22 ఉద్యోగ ఖాళీలు ఉండగా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 5, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ్ ఖాళీలు 5, సీనియర్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 4, చీఫ్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 3, జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు విద్యార్హతలు, పోస్ట్‌ క్వాలిఫి కేషన్‌ అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఈ మెయిల్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు csrecruitment.cil@coalindia.in ఈ మెయిల్ కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా విభాగంలో డిగ్రీతోపాటు కంపెనీ సెక్రటరీ అర్హత, ఐసీఎస్‌ఐ అసోసియేట్‌ ఫెలో మెంబర్ షిప్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కోల్‌ ఇండియా లిమిటెడ్ కోల్ కతా అడ్రస్ కు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి నివృత్తి చేసుకోవచ్చు. తక్కువ ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంది.

Back to top button