టాలీవుడ్సినిమా

‘కలర్ ఫొటో’ క్రేజ్‌ మామూలుగా లేదుగా


షార్ట్‌ ఫిలిమ్స్‌తో పేరు తెచ్చుకొని టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు సుహాస్. దోచెయ్‌ మూవీతో జూనియర్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ విజయవాడ కుర్రాడు ‘పడి పడి లేచే వయసు’తో హాస్య నటుడిగా మారాడు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్‌, మజిలి, ప్రతి రోజు పండగే మూవీస్‌తో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడతను ‘కలర్ ఫొటో’ అనే మూవీతో హీరోగా మారబోతున్నాడు. అతని క్లోజ్‌ఫ్రెండ్‌, యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్‌ రాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సంపూర్ణేష్‌ బాబుతో ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ లాంటి పేరడీ మూవీస్‌ను రూపొందించిన అమృత ప్రొడక్షన్స్‌పై రాజేశ్ నీలమ్‌, బెన్నీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్‌. సునీల్‌ విలన్‌గా నటిస్తున్నాడు.

Also Read: వచ్చింది ప్రభాస్‌ మరి..

డియర్ కామ్రేడ్‌లో తన స్నేహితుడిగా నటించిన సుహాస్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిన్న మూవీకి సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ తన వంతు సాయం చేశాడు. మూవీ అఫీషియల్‌ టీజర్ను విజయ్‌ రిలీజ్‌ చేశాడు. నల్లగా ఉండే ఓ పేద అబ్బాయి.. అందంగా ఉండే గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే సమస్యలను హీరోను ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం. పల్లెటూరి వాతావారణంలో సాగే ప్రేమకథ ఇది అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ‘నాలా నల్లగా ఉన్నోడు అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనుండే ఫ్రెండ్సే ఎగతలి చేస్తారు. ఒకడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటాడు. ఒకడు గులాబ్‌జామ్‌ రసగుల్లా అంటాడు. ఒకడేమో ఆశకు హద్దుందా నీకు’ అంటూ సుహాస్‌ అమాయకంగా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. అలాగే, ‘మీరు బాగా ప్రేమించినోళ్లు చనిపోయారు. శవం పక్కన కూర్చుని ఏడుస్తున్నారు. అక్కడికి పులి వచ్చింది. మీరు ఏం చేస్తారండి?’ అని పోలీస్‌ ఆఫీసర్ పాత్రధారి సునీల్‌ అడిగితే ‘పారిపోతామండి’ అనే సుహాన్‌ కామెడీ టైమింగ్‌ బాగుంది. దీనికి ‘చూద్దాం ప్రేమ గొప్పదా.. భయం గొప్పదా’ అంటూ సునీల్‌ కన్నింగ్‌గా ప్రశ్నిస్తాడు.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

ఒక నిమిషం 41 సెకండ్ల నిడివితో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రిలీజైన 12 గంటల్లోనే వన్‌ మిలియన్‌ వ్యూస్‌ లభించాయి. యూ ట్యూబ్‌లో నంబర్ వన్‌ ట్రెండింగ్‌లో ఉంది. షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా యూట్యూబ్‌లో సుహాస్‌కు ఉన్న ఫ్యాన్‌ బేస్‌కు, టీజర్ రిలీజ్‌ చేసిన విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ కూడా తోడవడంతో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అవుతోంది. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ మూవీ తొందర్లోనే ఓటీటీలో రిలీజయ్యే చాన్సుంది. ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

Tags
Back to top button
Close
Close