కరోనా వైరస్

విజృంభిస్తున్న కరోనా .. అక్కడ 10 రోజుల పూర్తిస్థాయి లాక్ డౌన్..?

Complete Lockdown In Maharashtra

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాలో రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. 10 రోజుల పాటు ఇక్కడ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలైన తరువాత పరిస్థితులను బట్టి అధికారులు లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తెలుసుకోనున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?

కరోనా కేసులు పెరగడంతో మొదట ఇక్కడ నైట్ కర్ఫ్యూ అమలైంది. నైట్ కర్ఫ్యూను అమలు చేసినా పరిస్థితులలో పెద్దగా మార్పు రాకపోవడంతో బీడ్‌ కలెక్టర్‌ సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు ఇక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. అత్యవసర సేవలను మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయించడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

బీడ్ జిల్లాలో లాక్ డౌన్ అమలు కావడంతో నాందేడ్‌ జిల్లాల్లో రవాణ వ్యవస్థపై కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. లాక్ డౌన్ ప్రభావం తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై కూడా పడనుందని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులపై కూడా ఆంక్షలు అమలవుతూ ఉండటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్‌టీసీ బస్సులపై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. అత్యవసర సేవలందించే వాహనాలకు అనుమతులు ఉంటే మాత్రమే మినహాయింపులు ఇస్తారు.

Also Read: ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ తో ఆ లక్షణాలకు చెక్..?

నాందేడ్ జిల్లా మీదుగా తెలంగాణకు వచ్చే వాహనాలపై కూడా ఆంక్షలు అమలు కానున్నాయి. జిల్లా సరిహద్దులను సీల్ చేయకపోయినా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతుండటం గమనార్హం.

Back to top button