సినిమాసినిమా వార్తలు

‘మా’లో చిచ్చు: మళ్లీ ప్రకాష్ రాజ్ నిప్పులు

Conflict in 'Maa': Prakash Raj fires again

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (మా) ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది. మా ఎన్నికల చిచ్చు మళ్లీ చెలరేగింది. వచ్చే నెలలో జరిగే ఈ ఎన్నికలపై మాటల మంటలు చెలరేగాయి. ప్రస్తుత అధ్యక్షుడు నటుడు నరేశ్ తాజాగా మళ్లీ హాట్ కామెంట్ చేశారు. అసలు ఈ కరోనా టైంలో అసలు మా ఎన్నికలు నిర్వహించడం కష్టం అన్నట్టుగా మాట్లాడారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలనుకుంటున్నట్టుగా నరేశ్ చేసిన ప్రకటన ఇప్పుడు ‘మా’లో కొత్త చిచ్చు రేపింది.

ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ‘మా’ లొల్లిపై ట్వీట్ చేశాడు. ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ట్విట్టర్ లో ‘తెగేదాకా లాగకండి’ అంటూ హెచ్చరికతో కూడిన ట్వీట్ చేశారు. ఎన్నికలు నిర్వహించమన్న నరేశ్ అతడి బ్యాచ్ పై విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. సమస్యను మరింతగా లాగవద్దని ఆయన వారిని హెచ్చరించాడు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రకాష్ రాజ్, అతడి ప్యానెల్ నరేశ్ పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ నరేశ్ దానిని తప్పించుకుంటున్నారు.

‘మా అధ్యక్ష బరిలో పోటీకి దిగుతున్న మంచు విష్ణుకు ఇప్పటికే నరేశ్ మద్దతు తెలిపారు. నరేశ్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. నరేశ్ సమస్యను లాగడం ద్వారా విష్ణుకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ బృందం నమ్ముతోంది.

 

Back to top button