జాతీయంప్రత్యేకంరాజకీయాలు

సరిహద్దుల్లో కరోనా కలకలం.. అసలేం జరిగింది?


దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజుకు రోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 48వేల 318కి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 10వేల 120లు ఉండగా 3లక్షల 21వేల 273మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 16,475మంది కరోనా మృతిచెందారు. గడిచిన 24గంటల్లోనే 19వేల 459 కొత్త కేసులు నమోదైనట్లు తాజాగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే భారత సరిహద్దుల్లో కరోనా కలకలం రేపుతోంది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనే సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ఓ కమాండర్ స్థాయి అధికారి మృతిచెందినట్లు చైనా ప్రకటించింది. నాటి నుంచి ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలు ఇరుదేశాల సరిహద్దుల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

తాజాగా భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం మొదలైంది. ఆదివారంనాడు ఏకంగా 21మందికి క‌రోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందరినీ ఐలేషన్ కి తరలించారు. ఇప్పటికే భారత సైన్యంలో 305మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వారందరికీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరంతా త్వరలోనే కోలుకుంటారని ఆర్మీ వర్గాలు చెబుతోన్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో జవాన్లకు కరోనా సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

మరోవైపు చైనాలోనూ కరోనా మహమ్మరి సేకండ్ వేవ్ చూపిస్తుంది. చైనాలోని బీజింగ్లో కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా.. మరోవైపు చైనాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనైనా సత్తా భారత ఆర్మీకి ఉందని కేంద్రం చెబుతోంది. అయితే మన్ముందు పరిస్థితులు ఎలా మారుతాయనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.

Tags
Show More
Back to top button
Close
Close