సినిమా వార్తలు

ఇలా అయితే ఇప్పట్లో భవిష్యత్తు లేనట్లే !

Corona
సినిమా చూడటానికి రెండు గంటలే ఉంటుంది, కానీ.. ఆ రెండు గంటల కోసం దాదాపు అరవై మంది సుమారు రెండు సంవత్సరాల పాటు కష్టపడతారు. అలాగే దర్శకనిర్మాతలతో పాటు హీరో కూడా తన భవిష్యత్తును ఆ రెండు గంటలను నమ్ముకునే పన్నంగా పెడతారు. అలాంటి సినిమాకి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఒకవిధంగా సినీ లోకం తాట తీస్తోంది. విచిత్రం ఏమిటి అంటే గతేడాది కన్నా ప్రస్తుతం ఎక్కువగా కోవిడ్ స్ప్రెడ్ అవ్వడం. అసలు రోజురోజుకూ సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇలాగే మరో నాలుగు నెలలు ఉంటే ఏమిటి పరిస్థితి ?

ఒక పక్క కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దాంతో ఒక్కొక్కటిగా తమ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నెలలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’, ‘తలైవి’ చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయని అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే వచ్చేనెలలో విడుదల కావాల్సిన ‘ఆచార్య’, బాలకృష్ణ మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే స్థితిలో లేవు. ఇలాగే మిగిలిన సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ను మార్చుకోవాల్సిన సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మొదటికి వచ్చింది.

అన్ని సినిమాల రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్నాయి. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని వచ్చే వారం నుంచి అసలు థియేటర్లనే మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్న చర్చ జరుగుతుంది. అలాగే థియేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే వ్యూహాన్ని అమలు పరుస్తోందని అంటున్నారు. ఇలా అయితే సినిమాకి ఇప్పట్లో భవిష్యత్తు లేనట్లే.

Back to top button