జాతీయంరాజకీయాలు

కరోనా శవాలను గంగానదికి వదిలేస్తున్నారు

Corona bodies are being dumped into the Ganges

Riverpenna river

 

గంగానది పాప వినాశిని.. పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేస్తే ఏన్నో జన్మల పుణ్యమట.. అందుకే ఈ కైలసం నుంచి జాలువారే గంగానదిలో తమ కుటుంబ సభ్యుల అస్తికలను కలిపేస్తుంటారు. అయితే చనిపోయిన వారి విభూతిని కలపడం పక్కనపెడితే.. ఇప్పుడు కరోనాతో చనిపోయిన శవాలను ఈ గంగానదిలో పడేస్తున్న దారుణం తాజాగా చోటుచేసుకుంది. దానివల్ల గంగానది మొత్తం కలుషితమై మరింత మందికి కరోనా సోకే ప్రమాదాలు ఉన్నాయి.

తాజాగా గంగానది పారే బీహార్ లోని బక్సర్ జిల్లాలో నదిలో మృతదేహాలు బయటపడడం అందరినీ షాక్ కు గురిచేసింది. గంగానదిలో కిలోమీటర్ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు. కరోనా మృతులను గంగానదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఢిల్లీ తీరంలో గల యమునా నదీ తీరంలోనూ ఇదే భయానక దృశ్యాలు కనిపించాయి. 10కి పైగానే కరోనా మృతదేహాలు నదీతీరంలో తేలుతూ కనిపించడం అందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి.

ఇక ఉత్తరప్రదేశ్ లోనూ గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోవడం.. శ్మశాన వాటికలు నిండిపోతుండడంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నామని కొందరు పేర్కొంటున్నారు. గుర్తు తెలియని.. ఎవరూ తీసుకుపోని కొన్ని కరోనా మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని.. తద్వారా వారికి పుణ్యం దక్కుతుందని ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు.

అయితే కోవిడ్ భయంతో ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహిద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే బాధితులు ఇలా నదిలో మృతదేహాలను వదిలేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. యూపీలోని కొన్ని తెగల వారు సైతం కాల్చడం.. పూడ్చివేయకుండా ఇలానే నదిలో వదిలేస్తారని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఘోరానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Back to top button