ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

చైనాలో విజృంభిస్తోన్న కరోనా.. ఎయిర్ పోర్ట్ మూసివేత ..?


కరోనా మహమ్మారి పుట్టినల్లైన చైనా దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో చాలా రోజుల తరువాత మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా దేశంలో ఎల్లప్పుడూ ప్రయాణికులతో షాంగై నగరంలోని ఉడాంగ్ ఎయిర్ పోర్ట్ విపరీతమైన రద్దీతో ఉంటుంది.

Also Read: ప్రజలకు షాకింగ్ న్యూస్.. వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు..?

ఆ ఎయిర్ పోర్ట్ లోని ప్రయాణికులకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ను పూర్తిగా కట్టడి చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తుండగా కొత్తగా నమోదవుతున్న కేసులు ఆ దేశంలోని అధికారులను టెన్షన్ పెడుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లో పనిచేసే సిబ్బంది, ప్రయాణికులు 17,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

Also Read: తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు

చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా అక్కడక్కడా మళ్లీ కొత్త కేసులు నమోదవుతూ ఉండటం చైనా ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ఉడాంగ్ ఎయిర్ పోర్ట్ ను మూసివేయడం వల్ల 500 అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు జాతీయ విమాన సర్వీసులు కూడ ఆగిపోయాయని తెలుస్తోంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉడాంగ్ ఎయిర్ పోర్ట్ కరోనాకు కేంద్రంగా మారుతోందని అధికారులు భావించి అప్రమత్తమయ్యారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం:

చైనాలో గతేడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఎయిర్ పోర్టుల ద్వారా ప్రయాణికులు ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించి వైరస్ వ్యాప్తి చెందింది. ప్రపంచ దేశాలు చైనా నిర్లక్ష్యం వల్లే తమ దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోపణలు చేశాయి. దీంతో చైనా ప్రయాణాలపై ఆంక్షలు విధించి ఎయిర్ పోర్టులను మూసివేసి వైరస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది.

Back to top button