అత్యంత ప్రజాదరణఆరోగ్యం/జీవనం

కరోనాకు మంచి మందు ఇదే.. ఈ ఆకురసంతో వైరస్ కు చెక్..?

Basil Leaf

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. తులసి ఆకులు కరోనా వైరస్ కు చెక్ పెట్టడంతో ఎంతగానో సహాయపడుతున్నాయి. వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న తులసి ఆకులతో ఎన్నో వ్యాధులను నయం చేయవచ్చనే సంగతి తెలిసిందే.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆహారంలో భాగంగా తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవచ్చు. రోజూ తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. అంధత్వ నివారణకు, గొంతు ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే తులసి ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ ను కలిగి ఉంటాయి. తులసి ఆకులు, లవంగాలు కప్పు నీటిలో వేసి మరిగించి రుచికోసం కొంత ఉప్పును జోడిస్తే దగ్గు నుంచి త్వరితగతిన ఉపశమనం కలుగుతుంది.

ఉదయం పరగడుపున తులసి ఆకులను తీసుకుంటే కిడ్నీలలోని రాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. కప్పులో వేడి నీటిని తీసుకుని ఆ నీటిలో కొన్ని నిమిషాల పాటు తులసి ఆకులు వేసి ఉంచి ఆ నీటిని నెమ్మదిగా సిప్ చేయాలి. అలా చేయడం వల్ల తులసి నుంచి శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా లభిస్తాయి. తులసి ఎ, సి, కె విటమిన్లతో పాటు శరీరానికి అవసరమైన మాంగనీస్, రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియంలను అందిస్తుంది.

తులసిలో హెర్బ్ యంటి ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తులసి ఆకులతో చేసిన రసాన్ని సిప్ చేయడం ద్వారా కరోనాకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది

Back to top button