ఆంధ్రప్రదేశ్కరోనా వైరస్

ఏపీలో కరోనా పూర్తిగా తగ్గుముఖం.. అత్యల్పంగా కేసులు నమోదు..?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో చాలా రోజుల తరువాత తొలిసారి 1000 లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 545 కొత్త కేసులు నమోదు కాగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ నిన్న ఒక్కరోజే 47,130 నమూనాలను పరీక్షించగా 545 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో గుంటూరు, ఈస్ట్ గోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 100 లోపే కేసులు నమోదయ్యాయి.

గుంటూరులో అత్యధికంగా 117 కేసులు నమోదు కాగా కర్నూలులో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలతో మృతుల సంఖ్య 6948కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులతో కరోనా మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,42,416 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,390 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షలకు పైగా కరోనా పరీక్షలు జరగగా త్వరలో పరీక్షల సంఖ్య కోటి మార్కును దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వైరస్ ఉధృతి తగ్గించేందుకు పరీక్షల సంఖ్యను పెంచుతోంది. రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలు పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

రాష్ట్రంలో అత్యల్ప స్థాయిలో కేసులు నమోదు కావడంతో మరికొన్ని రోజుల్లో వైరస్ ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యులు, అధికారులు భావిస్తున్నారు. 45 రోజుల క్రితం రాష్ట్రంలో 10,000కు అటూఇటుగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 1,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.

Back to top button