ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

సాధారణ జలుబుతో బాధ పడేవాళ్లకు కరోనా రాదంట..?

Corona Virus

మనలో చాలామందికి వర్షంలో తడిసినా, వాతావరణం మార్పుల వల్ల, ఇతర కారణాల వల్ల జలుబు చేస్తూ ఉంటుంది. కొంతమంది నిత్యం జలుబు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినా చాలా సందర్భాల్లో జలుబు తగ్గదు. అయితే శాస్త్రవేత్తలు, వైద్యులు జలుబు మనకు మంచే చేస్తుందని చెబుతున్నారు. తరచూ సాధారణ జలుబుతో బాధ పడేవాళ్లకు కరోనా రాదని తెలుపుతున్నారు.

Also Read: వాట్సాప్ వాడే కస్టమర్లకు షాకింగ్ న్యూస్..?

రైనో, పారా ఇన్ ఫ్లుయెంజా లాంటి కొన్ని రకాల వైరస్ లు జలుబుకు కారణమవుతాయి. అయితే సాధారణ జలుబు వల్ల వచ్చే ఇమ్యూనిటీ కరోనా బారిన పడకుండా కాపాడుతుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రైనా, పారా ఇన్ ఫ్లుయెంజా లాంటి వైరస్ లు కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలం పాటు మరికొన్ని సందర్భాల్లో శాశ్వతంగా కరోనా సోకకుండా అడ్డుకుంటాయని తెలుపుతున్నారు.

ఐనా, పారా ఇన్ ఫ్లుయెంజా వైరస్ ల వల్ల జలుబు వస్తే రోగనిరోధ శక్తిలోని బీ కణాలు కరోనా వైరస్ శరీరంలోకి వస్తే వెంటనే యాంటీబాడీలను విడుదల చేసి కరోనా వైరస్ ను నిర్వీర్యం చేస్తాయి. మరోవైపు సూర్యరశ్మి ద్వారా వచ్చే అతినీల లోహిత కిరణాలు శరీరానికి అవసరమైన డి విటమిన్ ను ఇస్తాయని.. అతినీలలోహితకిరణాలు ఎముకల సాంద్రత, కండరాల బలానికి కూడా సహాయపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: లక్షల రూపాయల వేతనం ఇచ్చే టాప్ 5 ఉద్యోగాలు ఇవే..?

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో డి విటమిన్ తో లోపంతో బాధ పడుతున్న వాళ్లే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. మరోవైపు శాస్త్రవేత్తలు తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లలు ఆటలు ఆడేలా, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని అలా చేయడం వల్ల వాళ్లు ధృఢంగా ఉంటారని.. ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని తెలుపుతున్నారు.

Back to top button