క్రిస్మస్ వార్తా విశేషాలుక్రిస్మస్ స్పెషల్

కరోనా ఎఫెక్ట్.. బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలు రద్దు..!

ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచన.

Christmas celebration2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరం మిగిలిపోతుంది. ఈ ఏడాది తొలినాళ్లలోనే కరోనా ప్రపంచానికి పరిచయమైంది. 2020 సంవత్సరం ముగిసిపోతున్న సమయంలోనూ మానవాళిని కరోనాపీడ మాత్రం వీడటం లేదు.

Also Read:క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్‌ కేథడ్రల్‌?

కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం స్తంభించి పోతుంది. ఇటీవల కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టు కన్పించినా కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలవడం ఆందోళన రేపుతోంది.

ఈ ఏడాది అన్ని పండగులపై కరోనా ప్రభావం పడినట్లుగానే క్రైస్తవుల ప్రధాన పండుగ అయిన క్రిస్మస్ పై కూడా పడింది. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్రిటన్లో క్రిస్మస్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు రద్దు చేస్తున్న ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తాజాగా ప్రకటించారు.

సామూహిక ప్రార్థనలు.. వేడుకలతో కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రజలంతా ఈసారి క్రిస్మస్ వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు.

Also Read: క్రిస్మస్ పండుగ రోజున చేసుకునే ప్రత్యేకమైన వంటకాలివే..?

గత వారం రోజుల్లో బ్రిటన్లో కరోనా కేసుల సంఖ్య రెట్టింది. దీంతో డిసెంబర్ 20(ఆదివారం) నుంచే బ్రిటన్లో కఠినమైన లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో బ్రిటన్లోని 16మిలియన్ల మంది ప్రజలు ఈసారి ఇళ్లలోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు.

Back to top button