బ్రేకింగ్ న్యూస్సినిమాసినిమా బ్రేకింగ్ న్యూస్సినిమా వార్తలు

సోనూ సూద్ కు కరోనా.. చిరంజీవికి ప్రమాదం

Corona for famous actor .. danger to Chiranjeevi

కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. అందరికీ సోకుతూనే ఉంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సోకడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అలెర్ట్ అయ్యింది. బాలీవుడ్ లో ఇప్పటికే షూటింగ్ లన్నీ బంద్ కాగా.. టాలీవుడ్ లో మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో వరుసగా సినీ తారలంతా కరోనా బారిన పడుతున్నారు.

నిన్న పవన్ కళ్యాణ్ కు కరోనా సోకితే తాజాగా ప్రముఖ నటుడు సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిన్న సైకిల్ పై మాస్కు లేకుండా ఆచార్య షూటింగ్ కు సోనూ సూద్ వెళ్లడం.. బహుషా అప్పుడే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ తెలియజేశాడు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని.. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రకటించాడు.

కరోనా లాక్ డౌన్ వేళ సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేశాడు. వలస కూలీలను ఇళ్లకు పంపాడు. సోనూ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో అభిమానం పెరిగిపోయింది. గుడులు సైతం సోనూకు కట్టేశారు.

అయితే తాజాగా సోనూ సూద్ ను కరోనా వదల్లేదు. ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆయన షూటింగ్ లో పాల్గొంటున్న ఆచార్య మూవీ టీం అలెర్ట్ అయ్యింది. ఇందులో చిరంజీవి కూడా పాల్గొంటుడడంతో ప్రమాదం పొంచి ఉంది. సోనూ సూద్ కు కరోనా సోకడంతో ఆచార్య టీంలోని సభ్యులంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఐసోలేషన్ లో ఉంటాడని సమాచారం.

Back to top button